ప్రపంచంలోనే అరుదైన ‘గోల్కొండ బ్లూ’ వజ్రం వేలం..

Updated on: Apr 21, 2025 | 5:50 PM

భారతదేశపు ఘనమైన రాజరిక చరిత్రకు ప్రతీకగా నిలిచిన అత్యంత అరుదైన 'గోల్కొండ బ్లూ' నీలి వజ్రం మరోసారి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించనుంది. ఒకప్పుడు ఇండోర్, బరోడా మహారాజుల ఆధీనంలో ఉన్న ఈ అపురూప వజ్రాన్ని మే 14న జెనీవాలో క్రిస్టీస్ సంస్థ నిర్వహించే 'మాగ్నిఫిసెంట్ జ్యువెల్స్' వేలంపాటలో విక్రయానికి ఉంచనున్నారు.

23,24 క్యారెట్ల బరువున్న ఈ అద్భుతమైన వజ్రాన్ని పారిస్‌కు చెందిన ప్రఖ్యాత ఆభరణాల రూపకర్త జేఏఆర్ రూపొందించిన ఆధునిక ఉంగరంలో పొదిగారు. దీని విలువ 35 మిలియన్ల నుంచి 50 మిలియన్ డాలర్ల మధ్య అంటే సుమారు రూ. 300 కోట్ల నుంచి రూ. 430 కోట్లు ఉండవచ్చని క్రిస్టీస్ అంచనా వేస్తోంది. క్రిస్టీస్ ఇంటర్నేషనల్ హెడ్ ఆఫ్ జ్యువెలరీ, రాహుల్ కడాకియా స్పందిస్తూ.., ఇంతటి గొప్ప రాజరిక వారసత్వం కలిగిన వజ్రాలు జీవితకాలంలో ఒకసారి మాత్రమే మార్కెట్లోకి వస్తాయన్నారు. క్రిస్టీస్ తన 259 ఏళ్ల చరిత్రలో ఆర్చ్‌డ్యూక్ జోసెఫ్, ప్రిన్సీ, విట్టెల్స్‌బాచ్ వంటి ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన కొన్ని వజ్రాలను వేలం వేసే గౌరవాన్ని పొందిందన్నారు. రాజరిక నేపథ్యం, అసాధారణమైన రంగు, విశిష్టమైన పరిమాణంతో ది గోల్కొండ బ్లూ డైమండ్‌ ప్రపంచంలోని అత్యంత అరుదైన నీలి వజ్రాలలో ఒకటిగా నిలుస్తుందన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

17 మంది డాక్టర్లు గుర్తించలేకపోయిన జబ్బును చాట్ జీపీటీ గుర్తించింది

వింత విమానాశ్రయం! మామిడి చెట్టు కిందే వెయిటింగ్‌

ఆ డెలివరీ వ్యాన్‌కు దెయ్యం పట్టిందా ఏంది..? సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన దృశ్యం

ఎవరూ లేకుండానే బాలికల హాస్టల్ బాత్రూం నుంచి చప్పుళ్లు.. ఏంటా అని వెళ్లి చూడగా

చంకలో పిల్లను పెట్టుకొని ఊరంతా వెతికిన తండ్రి.. ఏంటి మావా ఇది