AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచంలో అతిపెద్ద శివలింగం బీహార్‌లో త్వరలో ప్రతిష్టాపన

ప్రపంచంలో అతిపెద్ద శివలింగం బీహార్‌లో త్వరలో ప్రతిష్టాపన

Phani CH
|

Updated on: Dec 03, 2025 | 5:24 PM

Share

ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఏకశిలా శివలింగాన్ని బీహార్‌లోని చంపారన్‌లోని విరాట్ రామాయణ్ మందిరంలో ప్రతిష్టించనున్నారు. తమిళనాడులోని మహాబలిపురం నుండి 33 అడుగుల ఎత్తు, 210 మెట్రిక్ టన్నుల బరువున్న ఈ శివలింగం 96 చక్రాల వాహనంపై 2100 కి.మీ. దూరం ప్రయాణిస్తోంది. ఈ అద్భుత ప్రతిష్టాపన మందిరానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

మనదేశంలో త్వరలో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఏకశిలా శివలింగాన్ని ప్రతిష్టించనున్నారు. అదెక్కడో కాదు.. బీహార్‌లోని చంపారన్‌లో. తమిళనాడులోని మహాబలిపురం స్థపతుల చేతుల మీదగా రూపుదిద్దుకున్న 33 అడుగుల ఎత్తు 210 మెట్రిక్‌ టన్నుల ఏకశిల శివలింగం.. రోడ్డు మార్గంలో చంపారన్ బయలుదేరింది. మహాబలిపురానికి దాదాపు 2100 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంపారన్‌కు చేరిన తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించి.. అక్కడి విరాట్ రామాయణ్ ఆలయంలో ఈ శివలింగాన్ని ప్రతిష్టించనున్నారు. చాకియా-కేసరియా రహదారిపై మహవీర్ మందిర్​ సమితి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న విరాట్​ రామాయణ మందిరం, 1,080 అడుగుల పొడవు, 540 అడుగుల వెడల్పుతో రూపుదిద్దుకుంటోంది. దీనికి 22 మందిరాలు, 18 గోపురాలు, 270 అడుగుల ఎత్తైన ప్రధాన గోపురం ఉంటాయి. రామాయణంలో ఉండే కొన్ని సన్నివేశాలను ఆలయ గోడల మీద చూడవచ్చు. మందిరం ముఖద్వారం దగ్గర ఇప్పటికే , వినాయకుడి ఆలయం, ప్రధాన ద్వారం, నంది విగ్రహం వంటి కట్టడాలు పూర్తయిపోయాయి. ప్రస్తుతం అతిపెద్ద శివలింగాన్ని ప్రతిష్టిస్తే తరువాత మిగిలిన ఆలయ పనులు పూర్తవుతాయని’ ఆలయ ట్రస్ట్ పేర్కొంది. అతిపెద్ద గ్రానైట్ శిలతో మహాబలిపురంలో ఈ లింగం రూపుదిద్దుకుంది. దాదాపు 10 సంవత్సరాలు శ్రమించి, అత్యంత శ్రద్ధతో అందం ఉట్టిపడేలా దీనిని తయారు చేశారు. ఈ శివలింగం బరువు అధికంగా ఉండడంతో దీనిని 96 చక్రాల హైడ్రాలిక్​ వాహనంపై తరలిస్తున్నారు. ఇంజినీర్ల పర్యవేక్షణలో దీని ప్రయాణం సాగుతోంది. దాదాపు 20 నుంచి 25 రోజులుపాటు దీని ప్రయాణం సాగనుందని’ ఆలయ ట్రస్ట్ తెలిపింది. మహాబలిపురం నుంచి చాకియా వరకు ఉన్న మార్గంలో భక్తులంతా ఈ శివలింగానికి ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. ఊరేగింపు, పూజలు, దర్శనం కోసం అనేక నగరాల్లో ప్రత్యేక వేదికలు నిర్మించారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ శివలింగాన్ని తరలిస్తున్నారు. 210 మెట్రిక్ టన్నుల బరువున్న ఈ శివలింగం దేశంలోని అతిపెద్ద ఏకశిలా గ్రానైట్ శివలింగం అవుతుంది. ఇది విరాట్ రామాయణ మందిరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ప్రాణప్రతిష్ కార్యక్రమలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సాధువులు, పండితులు, వేలాది మంది భక్తులు పాల్గొంటారని ఆలయ ట్రస్ట్ పేర్కొంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Elon Musk: ఇండియన్స్ లేకుండా అమెరికా అభివృద్ధి అసాధ్యం

రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. తత్కాల్‌ టికెట్ల బుకింగ్‌ లో కొత్త రూల్స్

ఫ్రీజర్‌లా మారిన అమెరికా.. మంచులో జారుతూ.. జూలో జంతువుల ఆటలు

ఆ విషయంలో నయన్‌ని ఫాలో కీర్తి సురేష్.. అదే ఆమె చేసిన తప్పా ??

నా కోసం కథలు రాయకండి.. కథల కోసమే నేను ఉంది