AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ర్యాపిడో బైక్‌ రైడర్‌ ఖాతాలో రూ.331 కోట్లు.. ఈడీ దర్యాప్తు

ర్యాపిడో బైక్‌ రైడర్‌ ఖాతాలో రూ.331 కోట్లు.. ఈడీ దర్యాప్తు

Phani CH
|

Updated on: Dec 03, 2025 | 5:30 PM

Share

ఒక రాపిడో బైక్ రైడర్ సాధారణ జీవితం వెనుక రూ.331 కోట్ల భారీ డిపాజిట్లు ఈడీని దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఎనిమిది నెలల్లో జమ అయిన ఈ నిధులు అక్రమ బెట్టింగ్ నెట్‌వర్క్, ముఖ్యంగా 1xBet కేసుతో ముడిపడి ఉన్నాయని ED అనుమానిస్తోంది. మ్యూల్ అకౌంట్ ద్వారా జరిగిన ఈ లావాదేవీల వెనుక ఉన్న అసలు సూత్రధారుల కోసం దర్యాప్తు కొనసాగుతోంది.

చేసేది రాపిడో బైక్‌ రైడర్‌ పని.. ఉండేది రెండు గదుల అద్దె కొంప. కానీ, బ్యాంక్‌ ఖాతాలో మాత్రం వందల కోట్ల రూపాయలు.. ఈడీ అధికారులకే పట్టపగలు చుక్కలు కనిపించాయి. ఢిల్లీలోని ఓ ర్యాపిడో బైక్‌ రైడర్‌ ఖాతలో ఏకంగా రూ.331 కోట్ల డిపాజిట్లను ఈడీ అధికారులు గుర్తించారు. కేవలం ఎనిమిది నెలల్లోనే డ్రైవర్ బ్యాంకు ఖాతాలో రూ.331 కోట్లకు పైగా జమ అయినట్లు ఈడీ గుర్తించింది. ఈ డబ్బు అక్రమ బెట్టింగ్ నెట్‌వర్క్‌తో ముడిపడి ఉందని భావిస్తున్నారు. 1xBet ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో డబ్బు జాడను ట్రాక్ చేస్తున్నప్పుడు రాపిడో డ్రైవర్ ఖాతా కనుగొన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆగస్టు 19, 2024- ఏప్రిల్ 16, 2025 మధ్య రాపిడో బైక్ టాక్సీ డ్రైవర్ బ్యాంకు ఖాతాలో రూ.331.36 కోట్లు జమ అయినట్లు ED చెబుతోంది. ఈ మొత్తాన్ని చూసిన ఈడీ బ్యాంకు రికార్డులలో చూపిన చిరునామాపై దాడి చేసింది. అక్కడ ఖాతా ఉన్న వ్యక్తి ఢిల్లీలోని ఒక చిన్న కాలనీలోని రెండు గదుల ఇంట్లో నివసిస్తున్నాడని, తన రోజువారీ అవసరాలను తీర్చుకోవడానికి రోజంతా బైక్ టాక్సీ నడుపుతున్నాడని ED కనుగొంది. ఆసక్తికరంగా ఈ ఖాతాలో జమ చేసిన డబ్బులో రూ.1 కోటి కంటే ఎక్కువ ఉదయపూర్‌లోని ఒక లగ్జరీ హోటల్‌లో జరిగిన విలాసవంతమైన డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ఖర్చు చేసినట్లు ఈడీ గుర్తించింది. ఈ వివాహం గుజరాత్ యువ రాజకీయ నాయకుడితో ముడిపడి ఉన్నట్లు తెలుస్తోంది. అతన్ని త్వరలో విచారణ కోసం పిలుస్తామని ఈడీ తెలిపింది. ఈ లావాదేవీల గురించి తనకు తెలియదని దర్యాప్తులో రాపిడో డ్రైవర్ చెప్పినట్లు సమాచారం. రాపిడో డ్రైవర్ ఖాతాను మ్యూల్ ఖాతాగా ఉపయోగించారని ED అధికారులు భావిస్తున్నారు. ఇది అక్రమ డబ్బును బదిలీ చేయడానికి సృష్టించిన లేదా అద్దెకు తీసుకున్న ఖాతా. ఇది తరచుగా నకిలీ KYC పత్రాల ద్వారా జరుగుతుంది. అనేక తెలియని మూలాల నుండి ఈ ఖాతాలోకి పెద్ద మొత్తంలో డబ్బు జమ చేశారని, అలాగే వెంటనే ఇతర అనుమానాస్పద ఖాతాలకు బదిలీ చేసినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. ఈ మూలాల్లో ఒకటి నేరుగా అక్రమ బెట్టింగ్‌తో ముడిపడి ఉంది. అయితే ఇతర నిధుల మార్గాలు, దాని నుండి ప్రయోజనం పొందిన వారిపై దర్యాప్తు కొనసాగుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రపంచంలో అతిపెద్ద శివలింగం బీహార్‌లో త్వరలో ప్రతిష్టాపన

Elon Musk: ఇండియన్స్ లేకుండా అమెరికా అభివృద్ధి అసాధ్యం

రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. తత్కాల్‌ టికెట్ల బుకింగ్‌ లో కొత్త రూల్స్

ఫ్రీజర్‌లా మారిన అమెరికా.. మంచులో జారుతూ.. జూలో జంతువుల ఆటలు

ఆ విషయంలో నయన్‌ని ఫాలో కీర్తి సురేష్.. అదే ఆమె చేసిన తప్పా ??