మెట్రో రైలులో జుట్లు పట్టుకున్న యువతులు.. దేనికోసమో తెలుసా ??
దేశ రాజధాని ఢిల్లీ మెట్రో రైలు తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. సోషల్ మీడియా పుణ్యమా అని మెట్రోరైలుకు సంబంధించిన ఏదో ఓ సంఘటన నెట్టింట వైరల్ అవుతూ ఉంటుంది. మెట్రో రైలులో డ్యాన్స్ చేస్తూ చేసిన వీడియోలైతే కోకొల్లలు. అసభ్యకర చేష్టలు, ముద్దుసీన్లు, డ్యాన్స్ రీల్స్, ప్రయాణికుల మధ్య ఘర్షణలు వంటి వీడియోలు చర్చకు దారి తీశాయి. ఇక తాజాగా ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఇది ఇద్దరు యువతులకు సంబంధించిన పంచాయతీ. మెట్రో రైలులో సీటు కోసం ఇద్దరు మహిళలు కొట్టుకుంటున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. వీడియోలో కనిపిస్తున్న విజువల్స్ ప్రకారం లేడీస్ కోచ్‌లో ఇద్దరు మహిళలు సీటు కోసం వాదించుకుంటున్నట్లు కనిపించింది. తొలుత చిన్నగా మొదలైన వీరిద్దరి మధ్య వాగ్వాదం.. చివరికి కొట్టుకునే వరకూ వెళ్లింది. ఇద్దరూ ఒకరినొకరు దూషించుకుంటూ కొట్టుకున్నారు. చివరికి సీట్లో కూర్చున్న మహిళ లేచి మరో లేడీని జుట్టు పట్టుకుని లాగుతుంది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇంతలో ఓ మహిళ వారిద్దరి మధ్య గొడవను అడ్డుకుంటుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బీర్ల ప్రియులకు షాక్.. కింగ్‌ఫిషర్ షాకింగ్ డెసిషన్
గంగిరెద్దు కొమ్ములకు UPI స్కానర్.. చిల్లర లేదని తప్పించుకోలేరు..
విమానంలో గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ.. కోపంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచి..
గూగుల్ మ్యాప్‌ని నమ్ముకుని వెళ్తే.. పోలీసులకు ఊహించని షాక్..
అరటి పండ్ల ఎగుమతికి ఏకంగా రైలునే వేశారు.. ఆ బనానా ట్రైన్ స్పెషల్ ఇదే