తనకు ఆహారం పెట్టిన మహిళకు రిటర్స్ గిఫ్ట్ ఇచ్చిన కాకి.. అదేంటో తెలుసా ??
మూగజీవాలు, పక్షులకు కొందరు ఎంతో ప్రేమగా ఆహారాన్ని అందిస్తారు. కరోనా సమయంలో ఎంతో మంది వీధి కుక్కలకు, ఇతర జంతువులకు ఆహారం అందించారు.
మూగజీవాలు, పక్షులకు కొందరు ఎంతో ప్రేమగా ఆహారాన్ని అందిస్తారు. కరోనా సమయంలో ఎంతో మంది వీధి కుక్కలకు, ఇతర జంతువులకు ఆహారం అందించారు. ఇదిలా ఉంటే ఓ మహిళ తన ఇంటి ముందు వాలిన కాకికి ఆహారం పెట్టింది. అందుకు కృతజ్ఞతగా ఆ కాకి ఆ మహిళకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. కాకి తనకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన విషయాన్ని కొలీన్ లిండ్సే అనే మహిళ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు. తనకు ఎదురైన ఆ అనుభవం గురించి చెబుతూ ఆ మహిళ.. `లేక్ యూనియన్ వాటర్ ఫ్రంట్ దగ్గర ఉన్న ఒక కాకికి కొంచెం పేస్ట్రీని పెట్టాను. అందుకు ప్రతిగా తర్వాతి రోజు ఆ కాకి నాకు బహుమతి తెచ్చింది. ఒక చిన్న రాయిని తీసుకొచ్చి నా పాదాల దగ్గర వదిలింది` అని లిండ్సే తెలిపారు. ఆ కాకి, అది తీసుకొచ్చిన బహుమతికి సంబంధించిన ఫొటోలను కూడా లిండ్సే పోస్ట్ చేసారు. ఈ పోస్ట్‌ను వీక్షించిన వేలాదిమంది నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆటోను ఎత్తి కుదేసిన దున్నపోతు.. డ్రైవర్ ఆటో దిగలేదు గానీ లేకపోతేనా..
ఊసరవెల్లి రంగులు మారుస్తుండగా ఎప్పుడైనా చూశారా..
భారీ ఉడుమును అమాంతం మింగేందుకు యత్నించిన కళింగ పాము.. చివరకు !!