ఒకే మహిళలో 2 గర్భాశయాలు.. డాక్టర్లకే షాక్.. చివరకు ??
కవల పిల్లలు పుట్టడం చూశాం. అలాగే ఒకే కాన్పులో ముగ్గురు, నలుగురు శిశువులకు జన్మనిచ్చిన ఘటనలూ మనం చూశాం. కానీ ప్రపంచంలోనే అరుదైన ఘటన ఒకటి చైనాలోని షాంగ్జి ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. ఒక మహిళ కడుపులో రెండు గర్భాశయాలు ఉండటం. పైగా ఈ రెండు గర్భాశయాల ద్వారా ఒకేసారి గర్భం దాల్చింది. అంతకుమించిన ట్విస్ట్ ఏమిటంటే.. ఒకేసారి కవలలకు జన్మనివ్వడం.
కవల పిల్లలు పుట్టడం చూశాం. అలాగే ఒకే కాన్పులో ముగ్గురు, నలుగురు శిశువులకు జన్మనిచ్చిన ఘటనలూ మనం చూశాం. కానీ ప్రపంచంలోనే అరుదైన ఘటన ఒకటి చైనాలోని షాంగ్జి ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. ఒక మహిళ కడుపులో రెండు గర్భాశయాలు ఉండటం. పైగా ఈ రెండు గర్భాశయాల ద్వారా ఒకేసారి గర్భం దాల్చింది. అంతకుమించిన ట్విస్ట్ ఏమిటంటే.. ఒకేసారి కవలలకు జన్మనివ్వడం. ఈ ఘటన వైద్య ప్రపంచాన్నే ఆశ్చర్యానికి గురిచేసింది. ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ కథనం ప్రకారం.. మహిళకు చిన్నప్పటి నుంచే రెండు గర్భాశయాలు ఉన్నట్టు గుర్తించారు. ప్రపంచంలో ఇలా 0.3 శాతం మందికి మాత్రమే ఉంటుంది. ఈమెలో రెండు గర్భాశయాలు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఈ రెండింటికి వేటికవే అండాశయాలు, అండవాహికలు కూడా ఉన్నాయి. ఇలా ఉండడం చాలా అరుదు. ఆ మహిళ సహజ పద్ధతిలోనే గర్భం దాల్చడం, రెండు గర్భాశయాల ద్వారా ఒకేసారి బాబు, పాపకు జన్మనివ్వడం వైద్యులను ఆశ్చర్యపరిచింది. అంతేకాదు ఎనిమిదిన్నర మాసాలకే ఆమె ప్రసవించింది. మహిళకు రెండు గర్భాశయాలు ఉండడం, రెండింటితోనూ ఒకేసారి గర్భం దాల్చడం.. మిలియన్ మందిలో ఒక్కరికే జరుగుతుందని అక్కడి డాక్టర్ తెలిపారు. సహజ పద్ధతిలో రెండు గర్భాశయాల ద్వారా గర్భం దాల్చడం ప్రపంచంలోనే అత్యంత అరుదన్నారు. ఇప్పటి వరకు ఇలాంటి ఘటనలు రెండు మాత్రమే జరిగాయని, అందులో ఇదొకటని పేర్కొన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వామ్మో.. ఇది నాగుపామా.. కొండచిలువా ?? అమాంతం మింగేసిందిగా !!
3600 ఏళ్ల నాటి చైనీస్ మమ్మీ.. దాని మెడచుట్టూ ఏముందో తెలుసా ??
పైకి చూస్తే పాన్ షాప్.. లోపల ఖతర్నాక్ యవ్వారం