Viral Video: నది నీటిపై నడుచుకుంటూ వెళ్లిన మహిళ.. మిస్టరీ ఇదే.! వీడియో వైరల్

Updated on: Apr 17, 2023 | 8:37 AM

వైరల్ అయినట్లు ఈ వీడియోను జాగ్రత్తగా గమనిస్తే.. నీటి మట్టం చాలా తక్కువగా ఉన్న ప్రదేశంలో ఆమె నడుస్తోంది. పైగా ఆమె నడుస్తున్న ప్రాంతంలో నీటి అడుగున ఇసుక దిబ్బలు మేట వేశాయి.

నదీ ప్రవాహంపై ఎవరైనా నడుచుకుంటూ వెళ్లడం చూశారా..? దేవతలకు తప్పితే, మానవమాత్రులకు అలాంటిది సాధ్యం కాదు కదా! మధ్యప్రదేశ్‌లో ఓ మహిళ ఒక్కసారిగా సంచలనంగా మారారు. తెల్లని చీర కట్టుకున్న ఆ మహిళ నర్మదా నది నీటిపై నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఆమె నర్మదా మాతా అంటూ ప్రజలు కీర్తించారు. తాను సామాన్యురాలిని అని, తనకు ఎలాంటి అతీంద్రియ శక్తులు లేవని ఆ మహిళ చెబుతున్నారు. జనం మాత్రం ఆమెను దైవాంశ సంభూతిరాలిగా కొలుస్తూ.. ఆమె ఆశీర్వాదం తీసుకునేందుకు క్యూ కట్టారు. మరికొందరైతే మానవహారంగా ఏర్పడి నర్మదా తీరం నుంచి ఆమెను స్థానికంగా ఓ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడికి తరలివస్తున్న జనాన్ని కంట్రోల్ చేయడం పోలీసుల తరం కావట్లేదు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాలో నర్మదా నది తీరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మిస్టరీగా మారిన ఈ విషయాన్ని తేల్చడానికి పోలీసులు రంగంలోకి దిగారు. తన పేరు జ్యోతి రఘువంశీ అని, నర్మదా నది నీటిపై నడిచేందుకు 10 నెలల కిందట ఇంటి నుంచి వచ్చేశానని పోలీసులతో ఆ మహిళ చెప్పారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..

Allu Arjun Vibrant Look: ఉగ్రగంగమ్మగా పుష్పరాజ్‌.. సీన్ దద్దరిల్లాలే.. నెట్టింట ఊచకోత కోస్తున్న బన్నీ వీడియో..

Pushpa-2 Video: పుష్ప అడుగుపడితే.. పులి కూడా కుక్క అయిపోవాలే..! సోషల్ మీడియాను రఫ్పాడిస్తున్న పుష్ప..