AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Traffic Police: అయ్యాయ్యో ఇదేందక్కా.? కవర్ ఇలా వాడేస్తున్నావ్‌..! వైరల్ అవుతున్న వీడియో..

TS Traffic Police: అయ్యాయ్యో ఇదేందక్కా.? కవర్ ఇలా వాడేస్తున్నావ్‌..! వైరల్ అవుతున్న వీడియో..

Anil kumar poka
|

Updated on: Nov 05, 2021 | 11:06 AM

Share

TS Traffic Police: వాహన ప్రమాదాలను అరికట్టడం కోసం ట్రాఫిక్ నిబంధనలు రోజురోజుకూ కఠినతరం చేస్తున్నారు పోలీసులు..ఇందులో భాగంగానే హెల్మెట్‌ తప్పనిసరి చేశారు. అయితే ఇటీవల పిలియన్ రైడర్ కూడా అంటే..


వాహన ప్రమాదాలను అరికట్టడం కోసం ట్రాఫిక్ నిబంధనలు రోజురోజుకూ కఠినతరం చేస్తున్నారు పోలీసులు..ఇందులో భాగంగానే హెల్మెట్‌ తప్పనిసరి చేశారు. అయితే ఇటీవల పిలియన్ రైడర్ కూడా అంటే.. వాహనం నడిపే వ్యక్తే కాకుండా వెనుక కూర్చున్న వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే నిబంధనను తీసుకొచ్చారు. దీనిని సైబరాబాద్ పోలీసులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఎవరైనా హెల్మెట్ ధరించ లేదంటే ఫొటోలు తీసి చలానా మంజూరు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన ఓ జంట ఫోటోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు విభాగం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కాగా, ప్రస్తుతం ఈ ఫోటోలో నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది.

సదరు ఫోటోలో బైక్ వెనుక కూర్చున్న మహిళ తన తలకు హెల్మెట్ ధరించడానికి బదులు పాలిథిన్ కవర్‌ను చుట్టుకుంది. దీంతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సదరు మహిళను ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేశారు. ‘హెల్మెట్ ఫుల్ కవర్ అయి ఉండాలి అన్నారు కానీ కవర్‌ని హెల్మెట్‌లా వాడమనలేదు అని ఆ ట్వీట్‌లో చెప్పారు. దీంతో సైబరాబాద్ పోలీసులు పోస్ట్ చేసిన ఫోటో క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని చదవండి ఇక్కడ: Rashmika Mandanna: అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..(ఫొటోస్)

Hebah Patel: ఏంజెల్ లా మెరుస్తున్న ‘హెబ్బా పటేల్’.. ఇలా చుస్తే ఎవరైనా పడిపోవాల్సిందే.. (ఫొటోస్)

Woman With Cobra: డాక్టర్ గారూ ఇదే పాము కాటేసింది..అంటూ కాటేసిన పాముతో ఆస్పత్రికి.. అంతా షాక్‌..! (వీడియో)