Woman self marry: ఇదెక్కడి వింత..! తనని తానే పెళ్లి చేసుకుంటున్న యువతి.. హనీమూన్‌ ప్లేస్ కూడా ఫిక్స్.!

|

Jun 09, 2022 | 9:33 AM

లోకోభిన్నరుచిః అన్నారు పెద్దలు.. ఈ మాట నేటి జనరేషన్కు సరిగ్గా సరిపోతుంది. ముఖ్యంగా కాలక్రమంలో వచ్చిన అనేక మార్పుల్లో ఒకటి వివాహ బంధంలో కూడా చోటు చేసుకున్నాయి. స్త్రీ, పురుషులను వివాహం


లోకోభిన్నరుచిః అన్నారు పెద్దలు.. ఈ మాట నేటి జనరేషన్కు సరిగ్గా సరిపోతుంది. ముఖ్యంగా కాలక్రమంలో వచ్చిన అనేక మార్పుల్లో ఒకటి వివాహ బంధంలో కూడా చోటు చేసుకున్నాయి. స్త్రీ, పురుషులను వివాహం అనే బంధంతో ఏకం చేసి.. సరికొత్త జీవితాన్ని అందించే ఈ బంధంలో కూడా మార్పులు వచ్చాయి. ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకుంటున్న వార్తల గురించి తరచుగా వింటూనే ఉన్నాం.. అయితే ఇప్పుడు సరికొత్తగా ఒక యువతి.. తనని తానే పెళ్లి చేసుకుంటుంది. అంతేకాదు వివాహం అనంతరం హనీమూన్ కు గోవా కూడా వెళ్లానుకుంటుందట. ఈ విచిత్రమైన పెళ్లికి వేదికగా గుజరాత్ రాష్ట్రం కాబోతుంది.24 ఏళ్ల వడోదరకి చెందిన క్షమా బిందు అనే యువతి జూన్ 11న పెళ్లి చేసుకోనుంది. అయితే ఈ పెళ్లికి వరుడు సిద్ధంగా లేడు. ఆ యువతి తనని తానే పెళ్లి చేసుకుంటోంది. క్షమా బిందు వివాహం సాంప్రదాయ శైలిలో జరుగుతుంది. ఈ వివాహ వేడుక అగ్నిసాక్షి, సింధురం వంటి అన్ని ఆచార సంప్రదాయాల ప్రకారం జరగనుందట. అయితే.. పెళ్లి కొడుకు, ఊరేగింపు మాత్రం ఉండదు. తనకు ఎన్నడూ తాను వివాహం చేసుకోవాలని అనుకోలేదని, అయితే తనకు వధువు కావాలనే కోరిక ఉందని.. అందుకనే తనని తాను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నానని క్షమా బిందు తెలిపింది. అంతేకాదు ఈ పెళ్ళిని ‘సోలోగామి ,” అని అంటారని క్షమా తెలిపింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..

Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!

Man dies in hotel: హోటల్‌‌‌‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?

Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Published on: Jun 09, 2022 09:33 AM