వెజ్ మీల్‌లో నాన్‌వెజ్.. ఎయిర్ ఇండియా విమానంలో సిబ్బంది నిర్వాకం
కాలికట్ నుంచి ముంబై వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో మహిళా ప్రయాణికురాలు వీరాజైన్‌కు చేదు అనుభవం ఎదురైంది. శాకాహార భోజనం అడిగిన ఆమెకు విమాన సిబ్బంది అదే ఇచ్చినా.. అందులో చికెన్ ముక్కలు ఉండడంతో ఆమె అవాక్కైంది. అంతేకాదు, వారు సర్వ్ చేసిన ఆహార పొట్లంపై వెజ్ మీల్ అని స్పష్టంగా రాసివుంది కూడా. దీంతో వెంటనే ఆమె ఆ ఫొటోలు తీసి సోషల్ మీడియా ఎక్స్‌లో షేర్ చేసింది.
కాలికట్ నుంచి ముంబై వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో మహిళా ప్రయాణికురాలు వీరాజైన్‌కు చేదు అనుభవం ఎదురైంది. శాకాహార భోజనం అడిగిన ఆమెకు విమాన సిబ్బంది అదే ఇచ్చినా.. అందులో చికెన్ ముక్కలు ఉండడంతో ఆమె అవాక్కైంది. అంతేకాదు, వారు సర్వ్ చేసిన ఆహార పొట్లంపై వెజ్ మీల్ అని స్పష్టంగా రాసివుంది కూడా. దీంతో వెంటనే ఆమె ఆ ఫొటోలు తీసి సోషల్ మీడియా ఎక్స్‌లో షేర్ చేసింది. తాను అందుకున్న ఆహారంపై జైన్ విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకపోవడం తనకు ఆవేదన కలిగించిందని ఆమె పేర్కొన్నారు. వెజ్ మీల్స్‌లో నాన్‌వెజ్ ముక్కలు ఉన్నాయని చెప్పినప్పటికీ ఇతర ప్రయాణికులను అప్రమత్తం చేయలేదని తెలిపారు. దీనికి తోడు విమానం గంట ఆలస్యం కావడం, ఈ కారణంగా తాను వెళ్లాల్సిన రైలు మిస్ కావడంతో ఆమె తన మొత్తం అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ డీజీసీఏ, విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను ట్యాగ్ చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్మార్ట్‌ఫోన్‌ను తలదన్నే డివైస్.. పాకెట్‌లో ఇమిడిపోయే ‘ర్యాబిట్ ఆర్1’
‘అటల్ సేతు’ పై సముద్రంలో 16 కి.మీ. ప్రయాణం
విమానంలో నిలిచిపోయిన ఆక్సిజన్.. ఫుట్‌బాల్ జట్టుకు తప్పిన ప్రమాదం
భారత్, ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్.. 2 వేలమందికి ఫ్రీ ఎంట్రీ
మీకు గ్యాస్ కనెక్షన్ ఉందా ?? అయితే రూ.50 లక్షల ఇన్సూరెన్స్ గురించి తెలుసా ??