సెల్‌ఫోన్‌ ఎఫెక్ట్‌.. ఆ తల్లి చేసిన నిర్వాకం చూస్తే.. వీడియో

Updated on: Mar 16, 2025 | 7:34 PM

టెక్నాలజీ యుగంలో మొబైల్‌ ఫోన్‌ వినియోగం బాగా పెరిగిపోయింది. ఏ పని చేయాలన్నా మొబైల్‌ చేతిలో లేనిదే జరిగే పరిస్థితి కనిపించడంలేదు. మనుషుల జీవితాల్లో ఈ మొబైల్‌ ప్రాధాన్యం ఎంతగా పెరిగిపోయిందంటే.. పూర్వం పసి పిల్లలకు అన్నం తినిపించాలంటే చందమామను చూపించి వెన్నెల్లో ఆరోగ్యకర వాతావరణంలో చందమామ కథలు చెబుతూ అన్నం పెట్టేవారు. కానీ ప్రస్తుత పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

 పిల్లాడు అన్నం తిననని మారాం చేస్తే చటుక్కున వాడి చేతిలో సెల్‌ఫోన్‌ పెడుతున్నారు. లేకపోతే పిల్లలు అన్నం తినని పరిస్థితి. ఈ సెల్‌ ఫోన్‌ ఎఫెక్ట్‌ ఎంతగా ఉందంటే… ఫోన్‌ మాట్లాడుతూ ఓ తల్లి తన బిడ్డను పార్క్‌లో మర్చిపోయి వెళ్లిపోయిందంటే అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.ఓ మహిళ తన బిడ్డను తీసుకొని పార్క్‌కు వెళ్లింది. అక్కడ ఓ చోట కూర్చుని ఫోన్‌ మాట్లాడుతోంది. ఈక్రమంలో బిడ్డను పక్కనే పచ్చికపైన కూర్చోబెట్టింది. బిడ్డ ఆడుకుంటుంది కదా అని ఈమె ఫోన్‌ మాట్లాడుతోంది. అలా ఫోన్‌ మాట్లాడుతూ తన బిడ్డను పార్క్‌లోనే వదిలేసి వెళ్లిపోయింది. ఇది గమనించిన అక్కడే ఉన్న ఓ వ్యక్తి గబగబా ఆ బిడ్డను ఎత్తుకొని ఆ మహిళకు ఇచ్చేందుకు అమెను పిలుస్తూ వెళ్లాడు. ఆమె అతని పిలుపును పట్టించుకోలేదు. అతను మేడమ్‌… మేడమ్‌ అంటూ ఆమె వద్దకు పరుగుపరుగున వెళ్లాడు. ఆమె వెనక్కి తిరిగి చూసి అతని చేతిలో తన బిడ్డను చూసి అప్పుడు గుర్తుకొచ్చింది.. తను పార్క్‌లో బిడ్డను వదిలేసి వెళ్తున్నానని.. వెంటనే అతని వద్దకు వచ్చి పాపను తీసుకుంది. ఫోన్‌లో పడి బిడ్డను మర్చిపోయిన ఆ మహిళకు అతను కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం :

బీరువాలో నుంచి వింత శబ్ధాలు.. ఏంటా అని చూడగా గుండె గుబేల్‌!

విమానంలో సూది గుచ్చుకున్న వ్యక్తికి..రూ. 15 లక్షలు నష్టపరిహారం

నల్లగొండ కోర్టు సంచలన తీర్పు.. ప్రణయ్ కేసులో ఏం జరిగిందంటే వీడియో

అమెరికాలో సుదీక్ష మిస్సింగ్‌.. ఆ బీచ్‌లో ఏం జరిగి ఉంటుంది?వీడియో