భర్త కిడ్నీ అమ్మి.. ఆ డబ్బుతో ప్రియుడితో పరార్
పశ్చిమ బెంగాల్‌లో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. భర్త కిడ్నీ అమ్మించి, ఆ డబ్బు తీసుకొని ప్రియుడితో పరారైంది ఓ మహిళ. భార్య మోసాన్ని గ్రహించిన భర్త...చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించాడు. ఓ మహిళ..తన భర్తకు మాయమాటలు చెప్పి, అతని కిడ్నీని అమ్మించి ఆ డబ్బుతో పిల్లలను, భర్తను వదిలేసి, ఫేస్‌బుక్‌లో పరిచయమైన ప్రియుడితో వెళ్లిపోయింది.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం…పశ్చిమబెంగాల్‌లోని హవ్‌డా జిల్లాకు చెందిన మహిళ తమ కుమార్తెను బాగా చదివించి, వివాహం చేయాలంటే చాలా డబ్బు కావాలని, అందుకు తన భర్తను కిడ్నీ అమ్మాల్సిందిగా సూచించింది. కిడ్నీ అమ్మితే పెద్దమొత్తంలో డబ్బు వస్తుందని దాంతో మన ఆర్ధిక సమస్యలన్నీ తీరిపోతాయని నమ్మించింది. భార్య పట్టుబట్టడంతో చేసేది లేక సదరు భర్త తన కిడ్నీని రూ.10 లక్షల రూపాయలకు అమ్మాడు. ఆ డబ్బుతో తన కుటుంబ సమస్యలు తీరిపోతాయని, అందరూ సంతోషంగా ఉండొచ్చని భావించాడు. డబ్బు తీసుకొచ్చి భార్యకు ఇచ్చాడు. ఇంకేముంది ఆ డబ్బు తీసుకొని భర్తను, కుమార్తను మోసం చేసి ఫేస్‌బుక్‌లో పరిచయమైన రవిదాస్ అనే వ్యక్తితో మహిళ పరారయ్యింది. విషయం తెలుసుకొని లబోదిబోమన్న భర్త పోలీసులను ఆశ్రయించాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పక్కింటి అమ్మాయిని వీడియో తీసిన యువకుడు.. ఆ తర్వాత ??
ఆ హీరో చాలా స్పెషల్.. కానీ ఆ విషయమే నచ్చదు..
మహా కుంభమేళాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్..

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
