అమ్మవారు కలలో చెప్పారని రూ. లక్షలు తో తవ్వకాలు.. చూసేందుకు ఎగబడుతున్న జనాలు.. ( వీడియో )

విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకర్గంలో ఓ మహిళ.. తన కలలోకి అమ్మవారు వచ్చి చెప్పారంటూ రూ. లక్షలు ఖర్చుపెట్టి తవ్వకాలు చేస్తున్నారు.

  • Publish Date - 7:36 am, Tue, 15 June 21

విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకర్గంలో ఓ మహిళ.. తన కలలోకి అమ్మవారు వచ్చి చెప్పారంటూ రూ. లక్షలు ఖర్చుపెట్టి తవ్వకాలు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా వత్సలవలసలో వెలసిన రాజరాజేశ్వరి (రాజులమ్మ) అమ్మవారు తనకు కలలో కనిపించి.. ‘‘మీ భూముల్లో నేను విగ్రహాల రూపంలో ఉన్నాను.. తవ్వకాలు జరిపితే విగ్రహాలు లభ్యమవుతాయి’’ అని చెప్పిందని లక్ష్మి అనే మహిళ అంటున్నారు. అమ్మవారి చెప్పిన దాని ప్రకారం.. విగ్రహాలు కనిపెట్టేందుకు తవ్వకాలకు పూనుకున్నట్లు పుర్రేయవలస గ్రామానికి చెందిన కంది లక్ష్మి అంటున్నారు. అసలేం జరిగిందంటే.. పుర్రెవలస గ్రామంలో కంది లక్ష్మి కుటుంబంతో కలిసి జీవిస్తున్నారు. అయితే, శ్రీకాకుళం జిల్లా వత్సలవలసలో వెలసిన రాజులమ్మ తల్లి గత రెండు సంవత్సరాల నుంచి తనకు కలలోకి వస్తోందని.. తమ భూమిలో విగ్రహల రూపంలో వెలిసి ఉన్నానని చెప్పినట్లు సదరు మహిళ చెబుతున్నారు. 

మరిన్ని ఇక్కడ చూడండి: Virat And Williamson: విల‌య‌మ్‌స‌న్‌ను విరాట్ కోహ్లీ అవుట్ చేసిన వేళ‌.. వైర‌ల్ అవుతోన్న 2008 నాటి వీడియో..

Viral Video: చాలా గ్యాప్ తరువాత తెరుచుకున్న మద్యం దుకాణాలు.. మందు బాటిల్‌కు పూజలు.. వీడియో వైరల్..