Viral Video: బర్గర్ తినండి.. సైకిల్ తొక్కండి.. బంపర్ ఆఫర్‌ ఇస్తున్న బేకరీ..! వీడియో

|

Jan 14, 2022 | 3:49 PM

సైకిలింగ్‌ చేయడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తుంటారు. కండరాలు బలోపేతం కావడానికి, శరీరంలో అనవసర కొవ్వును కరిగించడానికి, అలాగే ఒత్తిడిని తగ్గించడానికి సైక్లింగ్‌ బాగా ఉపయోగపడుతుంది.

సైకిలింగ్‌ చేయడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తుంటారు. కండరాలు బలోపేతం కావడానికి, శరీరంలో అనవసర కొవ్వును కరిగించడానికి, అలాగే ఒత్తిడిని తగ్గించడానికి సైక్లింగ్‌ బాగా ఉపయోగపడుతుంది. ఇంతకీ విషయమేంటంటే… ఈరోజుల్లో పిజాలు..బర్గర్లు తిని అక్కర్లేని కొలెస్ట్రాల్‌ పెరిగిపోవడంతో అది తగ్గించుకోడానికి రకరకాల ఎక్సర్‌సైజులు, సైక్లింగ్‌లు చేసేవారికి ఓ బంపరాఫర్‌ ఇస్తోంది ఒక బేకరీ… మా బేకరీకి రండి… బర్గర్‌ తినండి.. సైక్లింగ్‌ చేయండి అంటూ ఆఫర్‌ చేస్తోంది చైనాకు చెందిన ఓ బేకరీ. సైకిల్ తొక్కుతూ బర్గర్ తినడం మంచిదేనా? అనే చర్చను కూడా తెర మీదికి తీసుకొచ్చింది ఈ చైనా బేకరీ సంస్థ. ఈ బేకరీలో సైక్లింగ్ మెషిన్ ఒకటి ఏర్పాటు చేశారు. కస్టమర్లు బర్గర్‌లను కొనుక్కొని… నేరుగా ఈ సైక్లింగ్ మెషీన్‌పై కూర్చోని తినాల్సి ఉంటుంది. బర్గర్ తిన్న వెంటనే శరీరంలోని కొవ్వును వదిలించుకోవాలనేది ఆ సంస్థ ఆలోచన. ఈ క్రమంలో ఓ యువతి బర్గర్ కొని ఈ సైక్లింగ్ మెషీన్ పై సైకిల్ తొక్కుతూ బర్గర్ తింటూ ఎంజాయ్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.