Viral Video: బర్గర్ తినండి.. సైకిల్ తొక్కండి.. బంపర్ ఆఫర్ ఇస్తున్న బేకరీ..! వీడియో
సైకిలింగ్ చేయడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తుంటారు. కండరాలు బలోపేతం కావడానికి, శరీరంలో అనవసర కొవ్వును కరిగించడానికి, అలాగే ఒత్తిడిని తగ్గించడానికి సైక్లింగ్ బాగా ఉపయోగపడుతుంది.
సైకిలింగ్ చేయడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తుంటారు. కండరాలు బలోపేతం కావడానికి, శరీరంలో అనవసర కొవ్వును కరిగించడానికి, అలాగే ఒత్తిడిని తగ్గించడానికి సైక్లింగ్ బాగా ఉపయోగపడుతుంది. ఇంతకీ విషయమేంటంటే… ఈరోజుల్లో పిజాలు..బర్గర్లు తిని అక్కర్లేని కొలెస్ట్రాల్ పెరిగిపోవడంతో అది తగ్గించుకోడానికి రకరకాల ఎక్సర్‌సైజులు, సైక్లింగ్‌లు చేసేవారికి ఓ బంపరాఫర్ ఇస్తోంది ఒక బేకరీ… మా బేకరీకి రండి… బర్గర్ తినండి.. సైక్లింగ్ చేయండి అంటూ ఆఫర్ చేస్తోంది చైనాకు చెందిన ఓ బేకరీ. సైకిల్ తొక్కుతూ బర్గర్ తినడం మంచిదేనా? అనే చర్చను కూడా తెర మీదికి తీసుకొచ్చింది ఈ చైనా బేకరీ సంస్థ. ఈ బేకరీలో సైక్లింగ్ మెషిన్ ఒకటి ఏర్పాటు చేశారు. కస్టమర్లు బర్గర్‌లను కొనుక్కొని… నేరుగా ఈ సైక్లింగ్ మెషీన్‌పై కూర్చోని తినాల్సి ఉంటుంది. బర్గర్ తిన్న వెంటనే శరీరంలోని కొవ్వును వదిలించుకోవాలనేది ఆ సంస్థ ఆలోచన. ఈ క్రమంలో ఓ యువతి బర్గర్ కొని ఈ సైక్లింగ్ మెషీన్ పై సైకిల్ తొక్కుతూ బర్గర్ తింటూ ఎంజాయ్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

