ఇల్లు శుభ్రం చేస్తుండగా మహిళకు దొరికిన ప్లాస్టిక్‌ కవర్‌.. అందులోఉన్నది చూసి షాక్‌ !!

|

Nov 05, 2024 | 7:10 PM

దీపావళి సందర్భంగా ఇంటిని శుభ్రం చేస్తున్న మహిళకు ఓ ప్లాస్టిక్‌ కవరు దొరికింది. అందులో ఏముందోనని చెక్‌ చేసిన మహిళకు ఊహించని దృశ్యం కనిపించింది. అందులో పెద్దమొత్తంలో కరెన్సీ నోట్లు కనిపించాయి. అది చూసి మహిళ మొదట ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత నోరెళ్లబెటింది. అందుకు కారణం ఆ నోట్లను రద్దు చేశారు కాబట్టి.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఓ ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ తన హ్యాండిల్‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది. దీపావళి సందర్బంగా ఇంటిని శుభ్రం చేస్తున్న ఓ మహిళకు పెద్ద నోట్ల రద్దుకు ముందు దాచిపెట్టిన పాత రూ.500, రూ.1,000 నోట్లు దొరికాయి. ఇవి రహస్యంగా పొదుపు చేసిన డబ్బులు అని, అయితే నోట్ల రద్దు జరిగిన కొన్నేళ్ల తర్వాత కంటబడడంతో ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని ఆమె పేర్కొంది. అత్యవసర సమయంలో ఉపయోగపడతాయని అప్పుడప్పుడు కొంత డబ్బు దాచిపెడుతుంటామని, అలా దాచిపెట్టిన నగదే ఇది అయి ఉంటుందని, నోట్ల రద్దు సమయంలో మార్చుకోవడం మరచిపోయామని తెలిపింది. కాగా ఇందుకు సంబంధించి సదరు మహిళ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో రూ.500, రూ.1,000 నోట్లు పెద్ద సంఖ్యలోనే కనిపించాయి. ఈ వీడియోను ఇప్పటికే 22 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. చాలామంది తమదైనశైలిలో కామెంట్లు చేశారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Vettaiyan OTT: ఓటీటీలోకి వేట్టయాన్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పట్నుంచి అంటే !!

జాతి వైరం మరిచి స్నేహంగా ఉంటున్న మూగజీవులు !!

హైదరాబాద్- విజయవాడ ప్రయాణికులకు గుడ్ న్యూస్

బాబోయ్ !! బ్లాస్టింగ్ అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న అనసూయ

యాల‌కుల నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా ??