ఒక్క టూత్ బ్రష్‌తో దుమ్ము దులిపేసిందిగా..వీడియో
సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. కొన్ని వినోదాన్ని పంచితే.. కొన్ని వీడియోలు విజ్ఞానాన్నీ పంచుతాయి. అసలే మన భారతీయుల తెలివితేటలు మామూలుగా ఉండవు. పనికిరాని వస్తువులను కూడా తమ బుద్ధి బలంతో పనిముట్లుగా మార్చేస్తారు. ఇందులో మన ఇండియన్స్‌ది అందెవేసిన చెయ్యి. మనవాళ్లు తయారుచేసిన ఎన్నో జుగాడ్‌లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచూ చూస్తుంటాం.
సోతాజాగా ఓ మహిళ చేసిన జుగాడ్ నెటిజన్లను ఆశ్చర్యపోయేలా చేస్తుంది. ఆ మహిళ తన ఇంటి విండోస్‌ని క్లీన్ చేస్తోంది. అదెలాగో చూసేయండి మరి..! వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ మహిళ వాడి పక్కన పడేసిన టూత్ బ్రష్‌ను తిరిగి ఉపయోగించిన విధానం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఆ మహిళ ఓ చాకు తీసుకొని దానిని స్టవ్‌మీద బాగా వేడిచేసింది. దాన్ని తీసుకొని వాడి పక్కన పడేసిన టూత్ బ్రష్ తల భాగాన్ని కట్‌చేసింది. ఆ తర్వాత బ్రష్ హ్యాండిల్ భాగాన్ని మంటమీద పెట్టి కాల్చింది. ఇప్పుడు ఈ హ్యాండిల్ తీసుకొచ్చి కట్ చేసిన బ్రష్ హెడ్‌కి వెనుకవైపున అతికించింది. ఇప్పుడది ఓ కొత్తరకం క్లీనింగ్ బ్రష్‌లా తయారైంది. దాంతో ఎంచక్కా కిటికీ మూలల్లో చేయి వెళ్లలేని చోటుకూడా ఈజీగా శుభ్రం చేసేసింది. మహిళ తయారుచేసిన క్లీనింగ్ బ్రష్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోల కోసం :
ఐస్‌క్రీమ్‌లో పాము పిల్ల.. వణుకు పుట్టిస్తున్న వీడియో
ఇదికదా టెక్నాలజీ అంటే.. అతని తెలివికి హ్యాట్సాఫ్ వీడియో