Woman Cop: ఒడిశాలో రెచ్చిపోయిన పేకాటరాయుళ్లు.! ఏం చేశారంటే.?

Updated on: Feb 21, 2024 | 6:06 PM

పేకాటరాయుళ్లు రెచ్చిపోతున్నారు. తీరిక దొరికిన సమయంలో చక్కగా దుకాణం పెట్టేస్తున్నారు. ఇక పోలీసులు నిఘా పెంచి ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు.. డబ్బు కూడా భారీగా స్వాధీనం చేసుకుంటున్నారు. తాజాగా పేకాటరాయుళ్లు రూటు మార్చారు. పోలీసులపైనే దాడి చేసి గదిలో బంధించారు. ఒడిశా రాష్ట్రంలో ఈ వ్యవహారం తాజాగా బయటపడింది. ఏం జరిగిందో అని ఆరా తీసిన ఇతర పోలీసులకు మైండ్‌ బ్లాంక్‌ అయింది.

పేకాటరాయుళ్లు రెచ్చిపోతున్నారు. తీరిక దొరికిన సమయంలో చక్కగా దుకాణం పెట్టేస్తున్నారు. ఇక పోలీసులు నిఘా పెంచి ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు.. డబ్బు కూడా భారీగా స్వాధీనం చేసుకుంటున్నారు. తాజాగా పేకాటరాయుళ్లు రూటు మార్చారు. పోలీసులపైనే దాడి చేసి గదిలో బంధించారు. ఒడిశా రాష్ట్రంలో ఈ వ్యవహారం తాజాగా బయటపడింది. ఏం జరిగిందో అని ఆరా తీసిన ఇతర పోలీసులకు మైండ్‌ బ్లాంక్‌ అయింది. జూదం ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు ఆ జూద గృహంపై రైడ్ చేశారు. పేకాటరాయుళ్లు మహిళా పోలీస్ అధికారిణి అని చూడకుండా ఆమెపై దాడి చేశారు. అలాగే ఆమెను, పోలీస్‌ సిబ్బందిని గదిలో బంధించారు. బాలాసోర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. తలసరి మెరైన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ చంపాబాటి సోరెన్, ముగ్గురు పోలీస్‌ సిబ్బందితో కలిసి ఆదివారం రాత్రి పెట్రోలింగ్ డ్యూటీ నిర్వహించారు. ఉదయపూర్ గ్రామంలో జూదం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో పోలీస్‌ అధికారిణి చంపాబాటి తన సిబ్బందితో కలిసి ఆ ఇంటిపై రైడ్‌ చేశారు. జూదం ఆడుతున్న వ్యక్తులు పోలీసులను చూసి రెచ్చిపోయారు. పోలీస్‌ అధికారిణి చంపాబాటి, ఆమె సిబ్బందిపై దాడి చేశారు. అలాగే వారిని ఒక గదిలో బంధించారు. అయితే భోగ్రాయ్ పోలీస్ స్టేషన్, చందనేశ్వర్ అవుట్‌పోస్ట్‌ పోలీసులకు ఈ విషయం తెలిసింది. దీంతో పోలీసులు ఆ జూద గృహానికి చేరుకున్నారు. గదిలో బంధించిన పోలీస్‌ అధికారిణి చంపాబాటి, సిబ్బందిని విడిపించి కాపాడారు. ఈ ఘటనకు సంబంధించి 20 మంది వ్యక్తులను అరెస్ట్‌ చేసినట్లు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్‌ ఉన్నతాధికారి తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..