పంది చిన్నగానే ఉందిగా అని తీసి పడేయకండి.. చిరుతకే సుస్సు పోయించింది

Updated on: Nov 26, 2025 | 12:47 PM

ఒక చిన్న అడవి పంది మూడు చిరుతపులులను ధైర్యంగా ఎదుర్కొని, వాటిని తరిమికొట్టిన అద్భుతమైన వీడియో వైరల్ అవుతోంది. సాధారణంగా చిరుతల ముందు నిలబడలేని అడవి పంది, ఊహించని సాహసంతో ప్రాణాలు కాపాడుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది, ధైర్యం చిన్నగా ఉన్నా ఎంతటి బలమైన శత్రువునైనా ఎదుర్కోవచ్చని నిరూపించింది.

అడవిలో పులి,చిరుతపులి, సింహానికి తిరుగే ఉండదు. ఇవి వేటాడాలని నిర్ణయించుకున్నాయంటే ఎంతటి జంతువుకైనా ఆరోజుతో ఆయువు ముగిసినట్టే. చిరుత వేట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాని వేగం, చురుకుదనం ముందు ఎవరైనా తలొంచాల్సిందే. అంతటి చిరుతను ఓ చిన్న అడవిపంది పరుగులు పెట్టించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ చోట చిన్న అడవి పంది మేత మేస్తూ ఉంది. ఇంతలో కొన్ని చిరుత పులులు దానిని చుట్టుముట్టాయి. పరిస్థితి చూస్తే అడవి పంది వాటికి ఆహారమైపోవడం ఖాయం అనిపిస్తుంది. కానీ ఊహించని విధంగా అడవి పంది చిరుతలకు షాకిచ్చింది. ఎంతో ధైర్యంగా వాటిని ఎదుర్కొంది. మొదట ఓ చిరుత అడవిపందిపై దాడికి యత్నించింది. అలర్టయిన అడవి పంది దానిని ధైర్యంగా ఎదుర్కొంది. దానిని తరిమి కొట్టేలోపు మరో చిరుత ఎటాక్‌ చేయబోయింది. ఏమాత్రం భయపడని అడవిపంది దానిని కూడా తరిమి కొట్టింది. అలా తనపై ఎటాక్‌ చేయబోయిన 3 చిరుతలకు చుక్కలు చూపించింది ఆ చిన్ని అడవి పంది. అడవి పంది థాటికి ఆ చిరులతకే చెమటలు పట్టాయి. బ్రతుకు జీవుడా అంటూ పారిపోయాయి. ఈ వీడియోను ఓ యూజర్‌ తన ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేశారు. నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియోను చూసిన నెటిజన్లు వామ్మో.. పంది చిన్నదే కానీ చిరుతలకే చెమటల పట్టించిందిగా.. అంటూ కామెంట్లు చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమావాస్య వేళ రంగు మారిన నీరు.. కారణం అదేనట

లైంగిక సామర్థ్యం పెంచుతానని లక్షలు ఖర్చు చేయించి.. చివరికి అనుకున్నది చేసాడు