Wife Kills Husband: ఇలాంటి ఆడవాళ్ళూ కూడా ఉంటారా.? ప్రియుడి మోజులో.. భర్తను చంపేందుకు భలే స్కెచ్..!
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఔషాపూర్ గ్రామంలో వృత్తిరీత్యా కూలీ పని చేసుకుని జీవనం సాగిస్తున్నారు మౌలాన్-శాంతి కుటుంబం. శాంతి గత కొంతకాలంగా తన ప్రియుడు బాబుతో
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఔషాపూర్ గ్రామంలో వృత్తిరీత్యా కూలీ పని చేసుకుని జీవనం సాగిస్తున్నారు మౌలాన్-శాంతి కుటుంబం. శాంతి గత కొంతకాలంగా తన ప్రియుడు బాబుతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. విషయం తెలిసి గత కొన్ని రోజులుగా భార్య భర్తల మధ్య పలుమార్లు ఇంట్లో గొడవలు జరగాయి. దీంతో విసిగెత్తిన భార్య శాంతి.. తన భర్తను హతమార్చాలని నిర్ణయించుకుంది. భర్త సేవించే మందులో విషం కలిపి ఇవ్వడంతో ప్రాణాలు కోల్పోయాడు. విషయం బయటకు రాకుండా తన భర్త కడునొప్పితో చనిపోయారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది శాంతి. రంగంలోకి దిగిన పోలీసులు.. మృతి చెందిన మౌలాన్ మృతదేహాని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్ట్ చూసి షాకైన పోలీసులు.. భార్య శాంతిని అదుపులోకి తీసుకుని విచారించగా వాస్తవాలు బయటకు వచ్చాయి. దీంతో శాంతితో పాటు ఆమె ప్రియుడు బాబును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని.. ప్రియుడు బాబు తో కలిసి భర్తను చంపినట్లు ఒప్పుకుంది శాంతి. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..