Maldives – Israel: ఇజ్రాయెల్‌పై మాల్దీవుల నిషేధం.. దాడులకు తెగబడుతున్న ఇజ్రాయెల్.
గాజాపై చేస్తున్న దాడులను వ్యతిరేస్తూ ఇజ్రాయెల్‌పై ద్వీప దేశం మాల్దీవ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ పౌరులు తమ దేశానికి రావడాన్ని నిషేధించింది. ఆదివారం నిర్వహించిన ‘పాలస్తీనా సంఘీభావం’ ర్యాలీలో మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు ఈ మేరకు ప్రకటించారు. ఇజ్రాయెల్ పాస్‌పోర్టు కలిగిన పౌరులు రావడాన్ని నిషేధిస్తున్నామని అధ్యక్షుడి భవనం అధికార ప్రతినిధి తెలిపారు.
గాజాపై చేస్తున్న దాడులను వ్యతిరేస్తూ ఇజ్రాయెల్‌పై ద్వీప దేశం మాల్దీవ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ పౌరులు తమ దేశానికి రావడాన్ని నిషేధించింది. ఆదివారం నిర్వహించిన ‘పాలస్తీనా సంఘీభావం’ ర్యాలీలో మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు ఈ మేరకు ప్రకటించారు. ఇజ్రాయెల్ పాస్‌పోర్టు కలిగిన పౌరులు రావడాన్ని నిషేధిస్తున్నామని అధ్యక్షుడి భవనం అధికార ప్రతినిధి తెలిపారు. అయితే దీనికి సంబంధించిన అధికారికంగా పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు. పాలస్తీనాకు మాల్దీవుల సంఘీభావం పేరుతో నిధుల సేకరణ కార్యక్రమాన్ని ముయిజ్జు ప్రకటించారు. గతంలో 1990లో ఇజ్రాయెల్ పౌరులపై విధించిన నిషేధాజ్ఞలు 2010లో ఎత్తివేసారు.
గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేయడంలో మాల్దీవుల్లొని ప్రతిపక్షాలు, ప్రజలు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ ఆ దేశ పౌరులపై నిషేధం విధించాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో అధ్యక్షుడు ముయిజ్జు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిషేధంపై ఇజ్రాయెల్ అధికార ప్రతినిధి స్పందించారు. ఇజ్రాయెల్ పౌరులను మాల్దీవులకు వెళ్లవద్దని సూచించారు. అక్కడ ఏమైనా జరిగితే సాయం చేయటం కష్టమవుతుందనీ అందుకే ఇజ్రాయెల్‌లోనే ఉండాలని తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.