Viral Video: కేక్‌ కటింగా ..? చావుకి వెల్కమా..? బర్త్‌డే బాయ్‌కు చేదు అనుభవం..

|

Jun 26, 2023 | 8:45 AM

పుట్టిన రోజంటే పిల్లలకు మహా సరదా. స్నేహితులందర్నీ ఇంటికి పిలిచి.. ఉత్సాహంగా కేక్‌ కట్‌ చేసి.. స్వీట్స్‌ పంచుతారు. కేక్‌ కట్‌ చేస్తున్నప్పుడు స్నేహితుల అరుపులు..స్పార్క్‌ క్యాండిల్స్ మెరుపులు, ఫోమ్‌ బాటిల్స్‌ నురగలు పుట్టిన రోజుకు మరింత అందం తెస్తాయి. అయితే,

కేక్‌ కట్‌ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే మహారాష్ట్రలోని ఓ అబ్బాయికి ఎదురైన అనుభవమే మీకూ ఎదురుపడొచ్చు! ఇంతకీ ఏమైందటే.. వార్దా జిల్లాకు చెందిన హృతిక్‌ వాంఖడే అనే అబ్బాయి పుట్టిన రోజు వేడుకలకు తన స్నేహితులందర్నీ ఆహ్వానించాడు. ఇల్లంతా పిల్లలతో సందడిగా ఉంది. ఆ అబ్బాయి కేక్‌ కట్‌ చేస్తుండగా ఇంతలో అతడి స్నేహితులు ఫోమ్‌ బాటిల్‌తో అతడిపై స్ప్రే చేస్తున్నారు. వెనకనున్న మరో అబ్బాయి మతాబు లాంటి బాణసంచా కాల్చుతున్నాడు. ఇంతలో ఏమైందో తెలీదు గానీ, బర్త్‌డే బాయ్‌ ముఖానికి నిప్పంటుకుంది. దీంతో ఒక్కసారి అతడు బెంబేలెత్తిపోయి. మంటను వదిలించుకున్నాడు. అయితే, అతడి తలపై ఎక్కువగా ఫోమ్‌ ఉండటం, మరోవైపు అక్కడ బాణసంచా కాల్చుతుండటంతో నిప్పంటుకొని ఉంటుందని భావిస్తున్నారు. ఏదేమైనా, పుట్టిన రోజున పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పాలి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌..

Follow us on