Loading video

పిచ్చి పీక్స్‌కి.. వీడియో చూస్తే వణుకొస్తుంది

|

Mar 18, 2025 | 12:37 PM

ప్రస్తుతకాలంలో రీల్స్‌ పిచ్చి బాగా పెరిగియింది. సోషల్‌ మీడియాలో పాపులర్‌ అవ్వాలని, వ్యూస్‌, లైక్స్‌ కోసం ప్రమాదకర సాహసాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కొందరు ప్రాణాలు సైతం పోగొట్టుకున్న ఘటనలూ ఉన్నాయి. తాజాగా ఓ కుర్రాడు రీల్స్ పిచ్చితో ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది.

ఒక కుర్రాడు ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం స్టంట్ చేయడానికి ప్రయత్నిస్తూ కదులుతున్న రైలు నుండి జారిపడ్డాడు. ఈ సంఘటన కాస్‌గంజ్ నుంచి కాన్పూర్‌కు ప్రయాణిస్తున్న రైలులో జరిగింది. ఓ కుర్రాడు రీల్‌ చేయాలనుకున్నాడు. అందుకోసం వేగంగా దూసుకెళ్తున్న రైలు కిటికి కడ్డీలను పట్టుకొని బయటికి వేళాడుతూ ఉన్నాడు. రైలు వేగం మరింత పెరగడంతో అతను కిందపడిపోయే పరిస్థితి వచ్చింది. కొద్ది సేపట్లో పడిపోతాడు అనే టైమ్‌లో ఎవరో అత్యవసర చైన్‌ లాగినట్టున్నారు. ట్రైన్‌ కాస్త స్లో అయింది. దీంతో ఆ కుర్రాడు పక్కకి దూకే ప్రయత్నంలో కింద పడిపోయాడు. అదృష్టవశాత్తు అతనికి పెద్దగా గాయాలు కాలేదు. దాంతో అతను మళ్లీ వచ్చి ట్రైన్‌ ఎక్కేశాడు. ట్రైన్‌ స్లో అయి ఉండకపోతే ఆ రైలు వెళ్తున్న వేగానికి అతను ఖచ్చితంగా కిందపడి ప్రాణాలు కోల్పోయేవాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో అదనపు డైరెక్టర్ జనరల్ కాన్పూర్ అధికారిక హ్యాండిల్ ఈ సంఘటనపై దర్యాప్తు చేయాలని ఫతేఘర్ పోలీసులను ఆదేశించింది.

మరిన్ని వీడియోల కోసం :

ఐస్‌క్రీమ్‌లో పాము పిల్ల.. వణుకు పుట్టిస్తున్న వీడియో

ఇదికదా టెక్నాలజీ అంటే.. అతని తెలివికి హ్యాట్సాఫ్‌ వీడియో

ముసుగులతో వచ్చి..తుపాకీ గురిపెట్టి..వీడియో

బరువు తగ్గాలని అన్నం తినడం మానేసిన యువతి.. చివరకు వీడియో

Published on: Mar 18, 2025 12:36 PM