Black Apple: బ్లాక్‌ డైమండ్‌ యాపిల్‌.. అంటే ఏంటి.? అసలు ఎప్పుడైనా చూశారా.?

|

Nov 18, 2023 | 7:58 PM

సాధారణంగా యాపిల్స్ ఎరుపు రంగులో ఉంటాయి. పచ్చని రంగులో ఉన్న యాపిల్స్‌నూ మనం చూస్తుంటాం. కానీ, బ్లాక్‌ యాపిల్స్ గురించి ఎప్పుడైనా విన్నారా? నిజమేనండీ ..ఆ రకమైన యాపిల్‌ పండ్లు కూడా ఉన్నాయి. కానీ, వీటి ధర ఎక్కువ. ఒక్కో పండు రూ.500 వరకు ఉంటుంది. యాపిల్‌ జాతుల్లోనే ఈ పండుకు ప్రత్యేకత ఉంది. కేవలం చైనా, టిబెట్‌లోని న్యింగ్‌చీ పర్వత సానువుల్లో మాత్రమే ఇది పండుతుంది.

సాధారణంగా యాపిల్స్ ఎరుపు రంగులో ఉంటాయి. పచ్చని రంగులో ఉన్న యాపిల్స్‌నూ మనం చూస్తుంటాం. కానీ, బ్లాక్‌ యాపిల్స్ గురించి ఎప్పుడైనా విన్నారా? నిజమేనండీ ..ఆ రకమైన యాపిల్‌ పండ్లు కూడా ఉన్నాయి. కానీ, వీటి ధర ఎక్కువ. ఒక్కో పండు రూ.500 వరకు ఉంటుంది. యాపిల్‌ జాతుల్లోనే ఈ పండుకు ప్రత్యేకత ఉంది. కేవలం చైనా, టిబెట్‌లోని న్యింగ్‌చీ పర్వత సానువుల్లో మాత్రమే ఇది పండుతుంది. దీన్ని ‘బ్లాక్‌ డైమండ్‌ యాపిల్‌’ అని కూడా పిలుస్తారు. నల్లని రంగులో మెరిసిపోతూ చూడగానే ఆకట్టుకుంటున్న ఈ పండు.. పుల్లపుల్లగా తియ్యతియ్యగా ఉంటూ భలే రుచిగా ఉంటుందట.! అతి తక్కువ ప్రాంతాల్లో పండించడం వల్ల దీనికి డిమాండ్‌ ఎక్కువ. అందుకే దీని ధర కూడా ఎక్కువగా ఉంటోంది. అంతేకాకుండా చైనాలోని ఉన్నతస్థాయి రిటైలర్లకు మాత్రమే వీటిని విక్రయిస్తారట. అది కూడా తక్కువ మొత్తంలోనే. ఈ పంట చాలా ఆలస్యంగా చేతికొస్తుంది. సాధారణ యాపిల్‌ చెట్లు రెండు మూడేళ్లలోనే కాపు మొదలు పెట్టగా.. బ్లాక్‌ ఆపిల్‌ తొలి పంట చేతికందడానికి కనీసం 5 నుంచి 8 ఏళ్లు పడుతుందట. పర్వతసానువుల్లోనే ఈ పంటను పండించాల్సి ఉన్నందున పెద్ద మొత్తంలో సాగు చేయడం వీలుపడదు. యాపిల్స్‌ను సేకరించడం కూడా కష్టమే. సాధారణంగా అక్టోబరు, నవంబర్‌ నెలల్లో ఈ పంట చేతికొస్తుంది. ఏడాదిలో అప్పుడప్పుడూ పండ్లు వచ్చినా.. వాటి రుచిలో మాత్రం తేడా ఉంటుందట. ధర అధికంగా ఉన్నప్పటికీ.. అందులోని పోషకాలు కూడా అదే స్థాయిలో ఉన్నందున ఈ బ్లాక్‌ యాపిల్‌ను కొనేందుకు చాలా మంది ఎగబడుతుంటారట.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.