పాడుబడిన ఇంట్లో కోట్ల రూపాయలు.. అసలు మ్యాటర్ తెలిస్తే మైండ్ బ్లాంకే
అతడు చేసేది చేపల వ్యాపారం.. కానీ, కోట్లలో సంపాదించాడు. ఎక్కడో తేడా కొట్టడంతో ఏకంగా సీఐడీ అధికారులే రంగంలోకి దిగారు. ఆ వ్యాపారి ఇంటిపై దాడి చేయగా..
అతడు చేసేది చేపల వ్యాపారం.. కానీ, కోట్లలో సంపాదించాడు. ఎక్కడో తేడా కొట్టడంతో ఏకంగా సీఐడీ అధికారులే రంగంలోకి దిగారు. ఆ వ్యాపారి ఇంటిపై దాడి చేయగా.. షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. అవును, బెంగాల్ సీఐడీ సోదాల్లో ఆ వ్యాపారి నుంచి కోటి 40 లక్షల రూపాయలు లభించడం తీవ్ర సంచలనం రేపింది. మాల్దా జిల్లా గజోల్ సిటీకి చెందిన జయప్రకాశ్ సాహా ఇంట్లో సోదాలు నిర్వహించిన సీఐడీ అధికారులకు నోట్ల కట్టలు దొరికాయి. జయప్రకాశ్ ఇంట్లో సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే, జయప్రకాశ్ సాహాకు చెందిన పాడుబడిన ఇంటి నుంచి కోట్ల రూపాయలు లభించడం తీవ్ర సంచలనం రేపింది. దీనిపై కూపీ లాపగా.. సీక్రేట్ వ్యాపారం గుట్టు రట్టు అయ్యింది. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో జయప్రకాశ్ డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తునట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. డ్రగ్స్ స్మగ్లింగ్ తోనే అతడు కోట్ల రూపాయలు సంపాదించినట్టు ఆరోపణలు వచ్చాయి. కౌంటింగ్ మెషీన్‌తో నోట్ల కట్టలను సీఐడీ అధికారులు లెక్కిస్తున్నారు. జయప్రకాశ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అరేయ్ ఏంట్రా ఇది.. చెయ్యెత్తి స్టాప్ అనగానే ఆగిపోయిన రైలు !! ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
పైకి చూస్తే చెరుకు తోట.. లోపలికెళ్ళి చూసిన పోలీసులకు.. మాములు సెటప్ కాదుగా
జీవితంలో ఇలాంటి బోటును చూసి ఉండరు !! 60 ఏళ్ల వయసులో గిన్నిస్ రికార్డు కొట్టిన హాన్సెన్
అనుభవించు రాజా.. పుట్టింది పెరిగింది ఇందుకే.. మనుషులకే అసూయ పుట్టిస్తున్న చింపాంజీ
ప్రేమ పేరుతో వంచన !! మైనర్ బాలికను గర్భవతి చేసి మరీ ??
