అనుభవించు రాజా.. పుట్టింది పెరిగింది ఇందుకే.. మనుషులకే అసూయ పుట్టిస్తున్న చింపాంజీ
మనిషి కోతినుంచి వచ్చాడు అనడానికి మరో ఉదాహరణ ఇప్పడు మీరు చూడబోయే వీడియో. ఎందుకంటే కోతులు, చింపాంజీల ప్రవర్తన చూస్తే అలానే అనిపిస్తుంది.
మనిషి కోతినుంచి వచ్చాడు అనడానికి మరో ఉదాహరణ ఇప్పడు మీరు చూడబోయే వీడియో. ఎందుకంటే కోతులు, చింపాంజీల ప్రవర్తన చూస్తే అలానే అనిపిస్తుంది. అవి అచ్చం మనుషుల్లాదానే ప్రవర్తిస్తాయని అధ్యయనాల్లో వెల్లడైంది కూడా. ఇదిలా ఉంటే ఇంటర్నెట్ విస్తృతి పెరిగిన తర్వాత అనేక రకాల వీడియోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. వాటిలో జంతువులకు సంబంధించిన వీడియోలు మరింత వైరల్ అవుతుంటాయి. ఇక కోతులకు సంబంధించిన వీడియోల గురించి చెప్పనే అక్కర్లేదు. తాజాగా ఓ చింపాంజీకి సంబంధించిన వీడియో నెటిజన్లకు అసూయ కలిగిస్తుంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ చింపాంజీ తెగ ఎంజాయ్ చేస్తుంది. అచ్చం మనిషిలా టోపీ, సన్‌గ్లాసెస్ ధరించి అందంగా ముస్తాబైన కోతి ఓ చెట్టు కొమ్మపై కూర్చుని వైన్ గ్లాసులో మిల్క్ షేక్‌ను తాగుతూ తెగ ఫోజులిచ్చింది. అది కూడా కాలు మీద కాలేసుకుని. ఇక నీళ్లలో కాళ్లు ఆడిస్తూ చిల్ అవుతోన్న ఈ చింపాంజీని చూస్తే ఎవరైనా అసూయ చెందాల్సిందే. క్రియేచర్ అరెనా అనే యూజర్ ట్విటర్‌లో ఈ వీడియోను షేర్ చేశారు. దీనికి కూల్ అని క్యాప్షన్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో బాగా వైరలవుతోంది. దీనిని చూసిన లక్షలమంది నెటిజన్లు ఫన్నీ రియాక్షన్లు ఇస్తున్నారు. ‘ఈ చింపాంజీ చిల్ మూమెంట్ మాములుగా లేదుగా’, ‘దీని దర్పం చూస్తే అసూయ పుడుతుంది’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రేమ పేరుతో వంచన !! మైనర్ బాలికను గర్భవతి చేసి మరీ ??
తాగివచ్చి భార్యను వేధిస్తున్న భర్త.. చివరికి షాకింగ్ ట్విస్ట్ !!
వీడియో తీసి హీరో అవుదాం అనుకున్న విద్యార్థి !! కట్ చేస్తే ఫ్యూజులు అవుట్
అరె ఏంట్రా ఇదీ !! ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయ్
భార్య ఇచ్చిన బహుమతే భర్తపాలిట వరమైంది !! వైరల్‌గా మారిన ఎమోషనల్ వీడియో
టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్ ఎక్కండి!
బేబీ అరిహా కథ.. ప్రధాని మోదీనే కదిలించింది
"పాలక్ పనీర్" దెబ్బకు రూ. 1.6 కోట్ల లాస్ అయిన అమెరికా వర్సిటీ
రైలుపై పడ్డ క్రేన్.. 22 మంది మృతి
కేజీ బంగారు నిధి కేసులో బిగ్ ట్విస్ట్..కుటుంబ సభ్యులకు పండగే పండగ
దారం లేని పతంగ్ చూసారా? ఎలా ఎగురుతుందంటే..
20 అడుగుల ఎత్తుతో భారీ బాహుబలి భోగిమంట.. వీడియో

