wedding invitation: మీ వల్లే మా పెళ్లి జరుగుతోంది..! పెళ్లికి రావాలంటూ ఇండియన్‌ ఆర్మీకి లేఖ.. సైనికులకు వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌

|

Nov 23, 2022 | 9:56 AM

సాధారణంగా పెళ్లి చేసుకునేవారు తమ ఏర్పాట్లలో తాము నిమగ్నమైపోతారు. తమ వివాహం ఎంతో ప్రత్యేకంగా ఉండాలని భావిస్తారు. కొందరు తమ జీవితంలో ముఖ్యమైన వారిని ప్రత్యేకంగా ఆహ్వానించాలనుకుంటారు


కేరళకు చెందిన రాహుల్‌, కార్తిక అనే యువ జంట నవంబరు 10 న వివాహం చేసుకున్నారు. ఈసందర్భంగా వారు సైనికులకు ఆహ్వానం పంపారు. ఈ క్రమంలో వారు సైనికులను తమ పెళ్లికి ఆహ్వానిస్తూ.. మీరు మ‌నం దేశం ప‌ట్ల చూపుతున్న ప్రేమ‌, అంకిత‌భావం, దేశ‌భ‌క్తికి మేం కృత‌జ్ఞుల‌మై ఉంటామ‌ని, మా భ‌ద్రత కోసం మీరు చేస్తున్న సేవ‌ల‌కు తామెంతో రుణ‌ప‌డిఉన్నామ‌ని, మీవల్లే తాము సంతోషంగా వివాహం చేసుకోగ‌లుగుతున్నామ‌ని తెలుపుతూ లేఖ రాసారు. ఇక తమ జీవితంలో ప్రత్యేక‌మైన రోజున మీరు రావాలి, మమ్మల్ని ఆశీర్వదించాలి. మీ ఆశీస్సులు కోరుతూ.. త‌మ‌ను కాపాడుతున్నందుకు థ్యాంక్‌యూ అంటూ వెడ్డింగ్ ఇన్విటేష‌న్‌లో రాసుకొచ్చారు. ఈ ఆహ్వానాన్ని అందుకున్న ఇండియ‌న్ ఆర్మీ ఆహ్వాన ప‌త్రిక‌ను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేస్తూ త‌మ‌ను పెళ్లికి ఆహ్వానించిన రాహుల్‌, కార్తీక‌లను ఆశీర్వదిస్తూ కృత‌జ్ఞత‌లు..కొత్త జంట‌కు శుభాకాంక్షలు తెలిపింది. ఇన్‌స్టాగ్రాంలో వైర‌ల్‌గా మారిన ఈ పోస్ట్‌పై యూజ‌ర్లు పెద్దసంఖ్యలో స్పందించారు. మ‌న రియ‌ల్ హీరోల‌ను పెళ్లికి ఆహ్వానించ‌డం గొప్ప విష‌య‌మ‌ని ఓ యూజ‌ర్ అంటే, దంపతుల నిర్ణయం గొప్పగా ఉంద‌ని మ‌రో యూజ‌ర్ రాసుకొచ్చారు. మ‌న రియ‌ల్ హీరోల‌కు జైహింద్ అని కొంద‌రు యూజ‌ర్లు వ్యాఖ్యానించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Dog saved cat: పిల్లిపిల్లను కాపాడేందుకు కుక్క ప్లాన్‌ అదుర్స్‌..! కుక్కపై ప్రశంసలు.. వైరల్‌ అవుతున్న క్యూట్‌ వీడియో.

David Warner As Dj Tillu: డీజే టిల్లు గెటప్‌లో అదరగొట్టిన డేవిడ్‌ వార్నర్‌.. అదరహో అనిపించేలా వార్నర్‌ న్యూలుక్‌..

Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..

Published on: Nov 23, 2022 09:56 AM