Telugu States: తెలుగు రాష్ట్రాల్లో చలిపులి పంజా.! పలు జిల్లాలను కమ్మేసిన పొగమంచు

|

Dec 26, 2023 | 7:50 PM

తెలుగు రాష్ట్రాలు చలితీవ్రతతో గజగజలాడుతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. తెల్లవారి 7 గంటలైనా సూర్యుడు కనిపించని పరిస్తితి నెలకొంది. ఓ వైపు పొగమంచు. మరోవైపు విపరీతమైన చలితో ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. చలినుంచి ఉపశమనం కోసం చలిమంటలను ఆశ్రయిస్తున్నారు. పొమంచు కమ్మేయడంతో రహదారులు కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

తెలుగు రాష్ట్రాలు చలితీవ్రతతో గజగజలాడుతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. తెల్లవారి 7 గంటలైనా సూర్యుడు కనిపించని పరిస్తితి నెలకొంది. ఓ వైపు పొగమంచు. మరోవైపు విపరీతమైన చలితో ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. చలినుంచి ఉపశమనం కోసం చలిమంటలను ఆశ్రయిస్తున్నారు. పొమంచు కమ్మేయడంతో రహదారులు కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో పొగమంచుకమ్మేసింది. రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు 8 డిగ్రీలకు పడిపోయాయి. మరోవైపు యాదాద్రిలోనూ పొగమంచు కమ్మేయడంతో ఇటు స్థానికులు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తీవ్రమైన పొగమంచు కురుస్తుండటంతో స్కూళ్లకు వెళ్లే విద్యార్ధులు ఇబ్బంది పడుతున్నారు. విద్యార్ధులు స్కూలుకు వెళ్లాలంటే భయపడుతున్నారు. ఇటు హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై మంచు కురుస్తుండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచుకమ్మేయడంతో రహదారులు కనిపించక అవస్థలు పడుతున్నారు.

మరోవైపు దట్టంగా అలముకున్న పొగ మంచు ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకంటోంది. తెల్లవారుజామును కురుస్తున్న మంచు తుంపరలను ప్రకృతి ప్రేమికులు ఎంజాయ్‌ చేస్తున్నారు. అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో కాశ్మీరును తలపిస్తున్నాయి మంచు కొండలు. సూర్యోదయం వేళ వెండికొండల్లా మెరుస్తున్న వంజంగి మేఘాలకొండ అందాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. కాగా పాడేరును దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఇక్కడి ఉష్ణోగ్రతలు 11° డిగ్రీలుగా నమోదు అయ్యాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

Follow us on