ఓర్నీ.. కొట్టకుండానే చేతి పంపుల నుంచి ఉబికి వస్తోన్న నీరు

|

Sep 10, 2024 | 12:46 PM

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. గ్రామాలు గ్రామాలు జలమయం అయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ఎందరో నిరాశ్రయులయ్యారు. పంటలు నీటమునిగాయి. రోడ్లు నదులను తలపించాయి. ఎన్నడూ లేనంతగా ఈసారి వరదముంపుతో జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. అయితే భారీ వర్షాల కారణంగా భూగర్భ జాలాలు బాగా పెరిగాయి.

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. గ్రామాలు గ్రామాలు జలమయం అయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ఎందరో నిరాశ్రయులయ్యారు. పంటలు నీటమునిగాయి. రోడ్లు నదులను తలపించాయి. ఎన్నడూ లేనంతగా ఈసారి వరదముంపుతో జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. అయితే భారీ వర్షాల కారణంగా భూగర్భ జాలాలు బాగా పెరిగాయి. అందుకు ఉదాహరణే ఈ ఘటన. కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలంలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. పులిగడ్డ గ్రామంలోని నాలుగు పంపుల్లో కొట్టకుండానే ధారాళంగా నీళ్లు వస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలతో గ్రామంలో భారీగా వరద నీరు నిలిచింది. దాంతో.. భూగర్భ జలాలు అధికంగా పెరిగాయి. ఈ క్రమంలోనే.. చేతిపుంపులను కొట్టకుండానే నీళ్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడే కాదు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో వర్షాలకు భూగర్భ జలాలు ఓ రేంజ్‌లో పెరిగాయ్.. దీంతో.. పొలాలోన్ని బోరు బావుల నుంచి కూడా మోటార్ ఆన్ చేయకుండానే నీరు ఉబికివస్తున్నాయ్. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏపీలోనూ హైడ్రా లాంటిది ఏర్పాటు చేస్తారా ??

మంచు విష్ణుపై దారుణ ట్రోల్స్.. శివబాలాజీ ఫిర్యాదుతో పోలీస్ యాక్షన్

Bigg Boss 8 Telugu: బయటకు వచ్చిన ఏడుపు స్టార్ మణికంఠ పెళ్లి వీడియో

Stree 2: OTT డేట్ ఫిక్స్.. ఇక నవ్వుతూ భయపడేందుకు గెట్ రెడీ

TOP 9 ET News: యానిమల్ డైరెక్టర్‌తో NTR..ఏదో సంచలనం జరగబోతోందా ??