కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్‌

Updated on: Jan 30, 2026 | 5:36 PM

సాధారణంగా కొబ్బరి కాయలను మనుషులు కోస్తారు. కానీ, ఒక అరుదైన వీడియోలో ఒక వానరం కొబ్బరి చెట్టెక్కి ఎంతో నైపుణ్యంతో కాయలను దింపుతీస్తోంది. రైతులాగే కాయల నాణ్యతను పరిశీలించి మరీ కోయడం విశేషం. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ అద్భుతమైన దృశ్యం నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది, నవ్వులు పూయిస్తోంది.

సాధారణంగా కొబ్బరి తోటలో చెట్ల పైనుంచి కొబ్బరి కాయలు దించాలంటే ఓ ప్రత్యేకమైన పద్ధతి ఉంటుంది. గ్రామాల్లో కొబ్బరి చెట్లు ఎక్కి కాయలు దించడానికి ప్రత్యేకంగా కొందరు ఉంటారు. వారు నెలకోసారి తోటలో కొబ్బరిచెట్టెక్కి బాగా అయిన కాయలను నాణ్యత చూసి ఆ తరువాత కొబ్బరికాయల దింపుతీస్తారు. ఇదంతా ఓకే.. ఒక వానరం కొబ్బరికాయలను దింపుతీయడం ఎక్కడైనా చూశారా? ఓ కోతి కొబ్బరి చెట్టుఎక్కి చకచకా కొబ్బరికాయలు దింపు తీసేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక కొబ్బరి తోటలో చెట్టుపైకి ఎక్కింది ఓ వానరం. చెట్టునిండా కొబ్బరికాయల గెలలు ఉన్నాయి. ఎంతో నైపుణ్యం రైతులా చెట్టుపైకి ఎక్కి కాయ నాణ్యత చూసి మరీ కొబ్బరి కాయలు తెంచుతోంది ఆ వానరం. కొబ్బరికాయల నాణ్యత చెక్‌ చేయడంలో తనకు తానే సాటి.. లేరు తనకు పోటీ అన్నట్టుగా కాయలు తెంచుతోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు.. కోతే గానీ…మహా ముదురు అంటూ నవ్వుకుంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కొవిడ్ తరహా స్క్రీనింగ్.. ఆ ఎయిర్‌పోర్టుల్లో మళ్ళీ మొదలు.. డేంజరస్ వైరస్‌ భయమేనా ??

పనిచేస్తున్న ఇంట్లోనే చోరీ.. రూ.18 కోట్ల బంగారం దోచుకెళ్లారు

ఆ ఒక్క యుద్ధనౌక చాలు.. ఇరాన్‌ పని ఖతమేనా?

పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా

ఏనుగు పిల్లకు పుట్టినరోజు వేడుక.. అదరగొట్టారుగా