Poisonous Wasp: అమ్మబాబోయ్.! ఈ విషపు ఈగలు కాలనాగు కంటే యమ డేంజర్..

|

Oct 12, 2024 | 7:19 PM

ఒకరు నాకు ఎదురు వచ్చినా, నేను ఒకరికి ఎదురువెళ్లినా వాళ్లకే డేంజర్.. ఈ డైలాగ్ ఖచ్చితంగా ఈ ఈగలకు సరిపోతుంది. ఒక్క ఈగకు భయపడతామా అని ఈగ సినిమాలో సుదీప్ మొదట లైట్గా తీసుకున్నట్టుగా పొరపాటున లైట్ తీసుకున్నామా.. ఇక అంతే సంగతులు. ప్రాణాలు పోయే వరకు అవి మనల్ని వదిలి పెట్టవు. ఈ విషపు ఈగలు కాలనాగు కంటే యమ డేంజర్.

ఒకరు నాకు ఎదురు వచ్చినా, నేను ఒకరికి ఎదురువెళ్లినా వాళ్లకే డేంజర్.. ఈ డైలాగ్ ఖచ్చితంగా ఈ ఈగలకు సరిపోతుంది. ఒక్క ఈగకు భయపడతామా అని ఈగ సినిమాలో సుదీప్ మొదట లైట్గా తీసుకున్నట్టుగా పొరపాటున లైట్ తీసుకున్నామా.. ఇక అంతే సంగతులు. ప్రాణాలు పోయే వరకు అవి మనల్ని వదిలి పెట్టవు. ఈ విషపు ఈగలు కాలనాగు కంటే యమ డేంజర్. కుడితే అంతే సంగతులు. ప్రాణాలు గాలిలో కలిసిపోవాల్సిందే. గత కొన్నేళ్లుగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం తీర ప్రాంత ప్రజలు వీటి పేరు చెబితే గజగజ వణికిపోతున్నారు.

అచ్చం తేనెటీగలను పోలి ఉండే కొన్ని విషపు ఈగలు తోటలలో చెట్లపై గూడులు ఏర్పర్చుకుంటున్నాయి. ఏమాత్రం అలికిడి అయినా ఆ మార్గంలో వెళ్లేవారిపై మెరుపుదాడి చేస్తున్నాయి. వీటి దాడిలో గత కొన్నేళ్లుగా పదుల సంఖ్యలో మనుషులు మృత్యువాత పడ్డారు. అనేక మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీటి దాడిలో మనుషులే కాదు పశువులూ మృతి చెందాయి. ఏ క్షణాన ఈ ఈగలు దాడి చేస్తాయో అని పశ్చిమగోదావరి తీర ప్రాంతవాసులు వణికిపోతున్నారు. తాజాగా ఇప్పుడు నరసాపురం మండలం రస్తుంబాద గ్రామంలో వ్యవసాయ పొలాల్లో తిష్ట వేసాయి ఈ కిల్లర్ బీస్. నిత్యం పొలం పనులు చేసుకునే కొబ్బరి దింపు కార్మికులు తిరిగే ప్రాంతం కావడంతో వారిపై ఎప్పుడు దాడి చేస్తాయో అని భయబ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా ఈ నెల 5న పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం అయోద్యలంక పంచాయతి పరిధిలోని మర్రిమూలలో కొబ్బరి దింపు కార్మికుడుపై ఇవి దాడి చేయటంతో ఆ వ్యక్తి చనిపోయాడు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం చవిరిపల్లి గ్రామానికి చెందిన బాడితమాని రెల్లబాబు పని కోసం వచ్చి ఈ ఘటనలో మృత్యువాత పడ్డాడు. ఇలాంటి ఘటనలు తరుచుగా జరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.