AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ratan Tata: రతన్‌ టాటాది లవ్‌ ఫెయిల్ ఆమెతోనేనా.? అందుకే పెళ్లి చేసుకోలేదా.?

Ratan Tata: రతన్‌ టాటాది లవ్‌ ఫెయిల్ ఆమెతోనేనా.? అందుకే పెళ్లి చేసుకోలేదా.?

Anil kumar poka
|

Updated on: Oct 12, 2024 | 7:07 PM

Share

గొప్పవాళ్లంతా ప్రేమలో విఫలమైనవారే.. అదే వారిని ఉన్నత శిఖరాలకు చేర్చిందేమో అనిపిస్తుంది చాలామంది చరిత్రలు చూస్తే. అందుకు మరో ఉదాహరణ మన రతన్‌ టాటా అని చెప్పక తప్పదు. వ్యాపార దిగ్గజంగా ఎన్నో విజయాలు సాధించిన రతన్‌ టాటాది కూడా ఎంతోమందిలా ఓ లవ్‌ ఫెయిల్యూరే. చాలామంది జీవితాల్లో ప్రేమకోసం యుద్ధాలే జరిగితే.. రతన్‌ టాటా విషయంలో మాత్రం ఓ యుద్ధం కారణంగా ఆయన లవ్‌ బ్రేకప్‌ అయింది.

గొప్పవాళ్లంతా ప్రేమలో విఫలమైనవారే.. అదే వారిని ఉన్నత శిఖరాలకు చేర్చిందేమో అనిపిస్తుంది చాలామంది చరిత్రలు చూస్తే. అందుకు మరో ఉదాహరణ మన రతన్‌ టాటా అని చెప్పక తప్పదు. వ్యాపార దిగ్గజంగా ఎన్నో విజయాలు సాధించిన రతన్‌ టాటాది కూడా ఎంతోమందిలా ఓ లవ్‌ ఫెయిల్యూరే. చాలామంది జీవితాల్లో ప్రేమకోసం యుద్ధాలే జరిగితే.. రతన్‌ టాటా విషయంలో మాత్రం ఓ యుద్ధం కారణంగా ఆయన లవ్‌ బ్రేకప్‌ అయింది. 1962లో భారత్‌, చైనా దేశాల మధ్య జరిగిన యుద్ధం రతన్‌ టాటా ప్రేమ విఫలం కావడానికి కారణమైంది. రతన్‌ టాటా 25 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు చదువు పూర్తి చేసుకుని అమెరికాలోని లాస్‌ఏంజెలిస్‌లో ఓ ఆర్కిటెక్చర్‌ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. ఆ సమయంలో అక్కడ ఓ యువతితో ప్రేమలో పడ్డారు. ఆమెను పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో జీవితంలో తనకు దిశానిర్దేశం చేసి, అండగా నిలిచిన నాయనమ్మ తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో ఆమె కోసం ఆయన స్వదేశానికి వచ్చారు. తన కోసం తన ప్రేయసి కూడా భారత్‌ వస్తుందని ఆశించారు. కానీ, భారత్‌– చైనా యుద్ధంతో ఆమె తల్లిదండ్రులు తనను భారత్‌ వెళ్లేందుకు అంగీకరించలేదు. దీంతో వారి ప్రేమకథ ముగిసింది. ఈ తొలి ప్రేమ ఆయనకు ఓ జ్ఞాపకంగా మిగిలిపోయింది.

తన ప్రేమకథను బయటపెట్టిన రతన్‌ టాటా ఆ మహిళ ఎవరనేది ఎప్పుడూ చెప్పలేదు. ఆ తర్వాత 1970ల్లో హిందీ చిత్రసీమలో ప్రముఖ నటీమణిగా వెలుగొందిన సిమీ గరేవాల్‌ తో ఉన్న అనుబంధం పెళ్లిపీటల వరకు వెళుతుందని ఆశించినా అది జరగలేదు. సిమీ మరొకరిని పెళ్లాడగా రతన్‌ టాటా ఒంటరిగా మిగిలారు. ఇలా మొత్తం నాలుగు సందర్భాల్లో ఆయన పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైనా వేర్వేరు కారణాలతో అవేవి జరగక ఆజన్మ బ్రహ్మచారిగానే ఉండిపోయారు. అలనాటి సినీ నటి, డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌ అయిన సిమి గరేవాల్‌- రతన్‌టాటా మరణంపై స్పందించారు. “వాళ్లు నువ్వు వెళ్లిపోయావని అంటారు.. నువ్వు లేవని అనుకోవడమే కష్టంగా ఉంది.. మిత్రమా ఇదే నీకు నా వీడ్కోలు” అంటూ సిమి గరేవాల్‌ ట్వీట్‌ చేశారు. వాస్తవానికి వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడిచింది. రతన్‌టాటా తన స్నేహితుడనీ 2011లో సిమి గరేవాల్‌ కూడా చెప్పారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.