వాగులో మునిగిన 8 ట్రాక్టర్లు భయంతో వణికిపోయిన డ్రైవర్లు వీడియో

Updated on: Sep 13, 2025 | 10:00 PM

నీరు అంతగా లేదులే అనుకుంటూ ఇసుక కోసం మానేరు వాగులోకి వెళ్ళిన ట్రాక్టర్ డ్రైవర్లు ఊహించని ప్రమాదంలో చిక్కుకున్నారు. వాగులోకి ఒక్కసారిగా వరదనీరు భారీగా రావడంతో ట్రాక్టర్లతో సహా వరదలో చిక్కుకున్న డ్రైవర్లు చాలా ఇబ్బంది పడ్డారు. దీంతో స్థానికులు వారిని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీస్ సిబ్బంది అతికష్టం మీద డ్రైవర్లను కాపాడారు. కానీ ఆ ఎనిమిది ట్రాక్టర్లు వరద నీటిలో మునిగిపోయాయి.

శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ళ ఇసుక కోసం భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్ల పల్లి ఓడేడు గ్రామం మధ్యగల మానేరు వాగులోకి వెళ్ళిన ఎనిమిది ట్రాక్టర్లు వరదలో చిక్కుకున్నాయి. మొదట అంతగా వరద లేకపోవడంతో కూలీలు ఇసుక తవ్వే పనిలో పడిపోయారు. కానీ ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో మానేరు వాగు ఒక్కసారిగా ఉద్ధృత రూపం దాల్చింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగడంతో ట్రాక్టర్లను అక్కడే వదిలేసి డ్రైవర్లు కూలీలు వెంటనే బయటకు పరిగెత్తారు. ఈ క్రమంలో వాగు మధ్యలో ఇసుక నింపుకుంటున్న ట్రాక్టర్లు ఎటు వెళ్ళలేని స్థితిలో నిలిచిపోయాయి. అయితే ఇసుక నింపుకున్న ఐదు ట్రాక్టర్లు వాగు దాటేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో వరద ఉద్ధృతి భారీగా పెరగడంతో అవన్నీ నీటిలో మునిగిపోయాయి. వాటిలో కొన్ని ట్రాలీలు బోల్తా పడడంతో డ్రైవర్లు ఆహాకారాలు చేశారు. కాగా స్థానికులు పోలీసులు వారిని తాళ్ల సహాయంతో ఒడ్డుకు చేర్చారు. ట్రాక్టర్లన్నీ బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు చేపట్టారు.

మరిన్ని వీడియోల కోసం :

ట్రంప్ డబుల్ గేమ్..పైకి ప్రేమ.. లోపల ద్వేషం వీడియో

ఎండ ఉన్నంతసేపు ఉరుకతనే ఉంటది..కాకినాడ కుర్రోడి ఖతర్నాక్‌ ఐడియా వీడియో

ఆ జిల్లాల్లో పిడుగులు పడొచ్చు జాగ్రత్త.. వీడియో

హైదరాబాద్‌ నుంచి 3 హై స్పీడ్ రైలు మార్గాలు వీడియో