రైల్వే స్టేషన్‌లో గుండె పగిలే ఘటన.. చూస్తే గుండె తరుక్కుపోతుంది
విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో నెలల వయసున్న శిశువును తల్లి శ్రావణి వదిలివెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేపింది. భర్త వదిలేయడం, ఆర్థిక సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రావణి బిడ్డను అనాథగా వదిలేసి ఆత్మహత్యకు ప్రయత్నించింది. రైల్వే పోలీసులు వెంటనే స్పందించి శిశువును రక్షించారు. శ్రావణికి కౌన్సిలింగ్ ఇచ్చి, వైద్య పరీక్షల అనంతరం తల్లిబిడ్డలను మళ్లీ కలిపారు.
విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో మనసును కదిలించే ఘటన చోటుచేసుకుంది. నెలల వయసున్న మగ శిశువును తల్లి నిర్దాక్షిణ్యంగా వదిలివెళ్లిన ఘటన కలకలం రేపింది. రైల్వే పోలీసుల సమయస్ఫూర్తితో ఆ శిశువు సురక్షితంగా చైల్డ్‌లైన్ సిబ్బంది వద్దకు చేరింది. రైల్వే స్టేషన్ జ్ఞానాపురం వైపు గేట్ నెంబర్–5 సమీపంలోని పార్సిల్ కౌంటర్ వద్ద ఈ ఘటన జరిగింది. ఉదయం అక్కడ పార్క్ చేసి ఉన్న ఓ ఆటోలో నుంచి శిశువు ఏడుపు వినిపించడంతో ఆటో డ్రైవర్ లోపల చూసాడు. వస్త్రంలో చుట్టి ఉంచిన శిశువును గుర్తించిన అతడు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు శిశువును స్వాధీనం చేసుకుని చైల్డ్‌లైన్‌కు అప్పగించారు. అనంతరం వైద్య పరీక్షల కోసం కేజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీలను పరిశీలించగా ఓ మహిళ చిన్నారిని తీసుకొని ప్లాట్‌ఫారంపై సంచరిస్తూ, ఆపై ఆటోలో శిశువును వదిలివెళ్లినట్టు గుర్తించారు. సమీపంలో లభించిన బ్యాగులో ఉన్న బ్యాంక్ పాస్‌బుక్, పత్రాల ఆధారంగా తల్లి వేపాడకు చెందిన శ్రావణిగా గుర్తించారు పోలీసులు. అర్జున్, శ్రావణి దంపతులు విశాఖ కొమ్మాదిలో నివాసముంటున్నారు. ఆరేళ్ల క్రితం వీరిద్దరికీ వివాహం జరిగింది. ఉపాధికోసం భర్తతో కలిసి విజయవాడకు వెళ్లింది శ్రావణి. అక్కడ పని దొరక్క పోవడంతో ఇద్దరూ జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో తిరుగుప్రయాణమయ్యారు. అయితే దువ్వాడ రైల్వే స్టేషన్‌లో రైలు దిగిన అర్జున్ భార్యకు చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయాడు. రైలు దిగి భర్తకోసం ఎంతగానో వెతికింది శ్రావణి. భర్త ఆచూకీ తెలియకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందింది. బిడ్డను పెంచే స్తోమత లేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. తల్లిగా కన్నబిడ్డ ప్రాణాలు తీయలేకపోయింది. ఎవరో ఒకరు పెంచుకోకపోతారా అన్న ఆశతో భగవంతుడిపై భారం వేసి పసిబిడ్డను రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఆటోలో వదిలి ఆత్మహత్య చేసుకోవాలని వెళ్లిపోయింది. ఇక్కడ ఆటోలో శిశువును గుర్తించిన పోలీసులు శ్రావణికోసం గాలింపు చేపట్టారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌లో స్పృహ కోల్పోయి ఉన్న శ్రావణి కనిపించింది వెంటనే ఆమెను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు శిశువును కేజీహెచ్‌లో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. అనంతరం శ్రావణి కి కౌన్సిలింగ్ ఇచ్చి శిశువును అప్పగించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Srisailam: భ్రమరాంబిక అమ్మవారికి బంగారు హారం
ఓర్నీ.. మటన్ బొక్క ఎంతపని చేసిందీ
రూ.99/- కే టికెట్…! హిట్టు కొట్టేందుకు మనోడి నయా స్ట్రాటజీ
TOP 5 ET: ఇక NTR విషయంలో జాగ్రత్త !! తారక్‌కు కోర్టు రక్షణ !!