Stone Baby: మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో బయటపడ్డ పుర్రె, శరీర ఎముకలు..
తీవ్రమైన కడుపునొప్పితో వచ్చిన మహిళను పరీక్షించిన విశాఖ కేజీహెచ్ వైద్యులు.. ఆమె కడుపులో శిశువు ఎముకల గూడు ఉండటాన్ని గుర్తించి ఆపరేషన్ చేశారు. ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్ శివానంద వివరాల ప్రకారం.. అనకాపల్లి జిల్లాకు చెందిన 27 ఏళ్ల మహిళకు ఇద్దరు పిల్లలు. మూడేళ్ల క్రితం మరోసారి గర్భం దాల్చడంతో అబార్షన్ కోసం మందులు వాడారు. ఆ తర్వాత నుంచి తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుండేవారు.
తీవ్రమైన కడుపునొప్పితో వచ్చిన మహిళను పరీక్షించిన విశాఖ కేజీహెచ్ వైద్యులు.. ఆమె కడుపులో శిశువు ఎముకల గూడు ఉండటాన్ని గుర్తించి ఆపరేషన్ చేశారు. ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్ శివానంద వివరాల ప్రకారం.. అనకాపల్లి జిల్లాకు చెందిన 27 ఏళ్ల మహిళకు ఇద్దరు పిల్లలు. మూడేళ్ల క్రితం మరోసారి గర్భం దాల్చడంతో అబార్షన్ కోసం మందులు వాడారు. ఆ తర్వాత నుంచి తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుండేవారు. ఈ క్రమంలో ఆగస్టు మూడో వారంలో కేజీహెచ్ ప్రసూతి విభాగ ప్రొఫెసర్ డాక్టర్ ఐ.వాణిని ఆమె సంప్రదించారు.
బాధితురాలికి అల్ట్రా సౌండ్ స్కాన్ చేసి కడుపులో కణితి లాంటి దాన్ని గుర్తించారు. అనంతరం ఎంఆర్‌ఐ స్కాన్ చేయగా 24 వారాల శిశువు ఎముకల గూడు ఉన్నట్లు తెలిసింది. అత్యంత అరుదుగా తలెత్తే ఈ సమస్యను వైద్య పరిభాషలో ‘లితోపెడియన్’, రాక్ బేబీ ఇంకా స్టోన్ బేబీ అనీ పిలుస్తారు. గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఇటువంటి కేసులు 25 కన్నా తక్కువ నమోదయ్యాయి. డా.ఆనంద్ బృందంతో కలిసి డాక్టర్ వాణి గత నెల 31న ఆమెకు శస్త్రచికిత్స చేసి కడుపులోని శిశువు ఎముకల గూడును విజయవంతంగా తొలగించారు. సాధారణ స్థితికి చేరుకున్న ఆమెను.. కొద్దిరోజుల తర్వాత డిశ్ఛార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.