Viral: బోనులో చిక్కిన పునుగు పిల్లి.. ఏం చేశారంటే.! వీడియో వైరల్..
పశ్చిమ గోదావరి జిల్లాలో అరుదైన పునుగుపిల్లి ప్రత్యక్షమైంది. శేషాచలం, నల్లమల అడవుల్లో కనిపించే ఈ అరుదైన జంతువు గంగానమ్మకోడు ప్రాంతానికి చెందిన ఈలి రమేష్ అనే వ్యక్తి ఇంటి ఆవరణలో ప్రత్యక్షమైంది. ఎలుకలు, పందికొక్కుల బెడద తట్టుకోలేక వాటిని పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన బోనులో పునుగుపిల్లి వచ్చి చిక్కుకుంది. ఉదయం బోనులో ఉన్న ఈ జంతువును చూసి రమేశ్ కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో అరుదైన పునుగుపిల్లి ప్రత్యక్షమైంది. శేషాచలం, నల్లమల అడవుల్లో కనిపించే ఈ అరుదైన జంతువు గంగానమ్మకోడు ప్రాంతానికి చెందిన ఈలి రమేష్ అనే వ్యక్తి ఇంటి ఆవరణలో ప్రత్యక్షమైంది. ఎలుకలు, పందికొక్కుల బెడద తట్టుకోలేక వాటిని పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన బోనులో పునుగుపిల్లి వచ్చి చిక్కుకుంది. ఉదయం బోనులో ఉన్న ఈ జంతువును చూసి రమేశ్ కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి చేరుకుని దానిని పునుగుపిల్లిగా గుర్తించారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
ఈ పిల్లి శరీరంలోని గ్రంథుల ద్వారా వచ్చే చెమట ఆరిపోయాక తైలంలా అట్టకడుతుంది.. ఇది సుగంధభరిత పరిమళాన్ని వెదజల్లుతుంది.. అందుకే తిరుమల శ్రీవారి సేవకు ఈ తైలాన్ని ఉపయోగిస్తారు. శ్రీనివాసునికి అభిషేకం పూర్తయిన తర్వాత ఈ పునుగుపిల్లి తైలాన్ని స్వామివారి శిరస్సునుంచి పాదాల వరకూ పులుముతారు. పునుగు పిల్లులు అంతరించిపోతుడంటంతో టీటీడీ ప్రత్యేకంగా వీటిని పెంచుతోంది. పునుగు పిల్లులను తిరుమలలోని గోశాలలో పెంచుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.