వాష్ రూమ్ డోర్ తీయగానే గుండె గుభేల్..

Updated on: Mar 12, 2026 | 4:45 PM

మీరు వాష్ రూమ్‌కి వెళ్తున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి! ఈ వార్త చదివాక వాష్‌రూమ్‌ డోర్‌ తెరవాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే.. విశాఖపట్నంలోని షీలానగర్‌లో జరిగిన ఒక భయానక ఘటన ఇప్పుడు అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. బెడ్ రూమ్‌కు అటాచ్ అయి ఉన్న వాష్ రూమ్‌లో ఒక నిండు ప్రాణం త్రుటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకుంది.

షీలానగర్‌లోని ఒక ఇంట్లో మహిళా యజమాని ఎప్పటిలాగే తన బెడ్ రూమ్‌లోని వాష్ రూమ్‌కు వెళ్లారు. లోపలికి వెళ్లి గడియ పెట్టుకున్నాక, కమోడ్ వైపు చూడగానే ఆమె గుండె ఝల్లుమంది. కమోడ్ లోపల ఏదో నల్లటి ఆకారం కదులుతున్నట్లు కనిపించింది. అది ఏంటని తదేకంగా చూసేలోపే.. ఒక్కసారిగా ఒక భారీ నాగుపాము బుసలు కొడుతూ పడగ విప్పింది! ఆమె ఒక్కసారిగా భయంతో కేకలు వేస్తూ, తలుపు తీసుకుని బయటకు పరుగులు తీసింది. వెంటనే తేరుకుని వాష్ రూమ్ డోర్ లాక్ చేసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. కుటుంబ సభ్యులు వెంటనే స్నేక్ క్యాచర్ నాగరాజుకు ఫోన్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న నాగరాజు, కమోడ్‌లో దాగి ఉన్న ఆ నాగుపామును చాకచక్యంగా పట్టుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.సాధారణంగా బయట ఉండే వాష్ రూమ్‌లలో పాములు రావడం చూస్తుంటాం. కానీ బెడ్ రూమ్ లోపల ఉన్న కమోడ్‌లోకి పాము రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సెప్టిక్ ట్యాంక్ పైపుల ద్వారా ఎలుకలను వేటాడుతూ ఈ పాము లోపలికి వచ్చి ఉంటుందని స్నేక్ క్యాచర్ అభిప్రాయపడ్డారు. ఆ మహిళ కొంచెం ఏమరుపాటుగా ఉన్నా ఆ కాలనాగు కాటుకు బలైపోయేది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

మరిన్ని వీడియోల కోసం :

స్పిరిట్‌ కథలో అవే హైలైట్స్ !

గ్లోబల్‌ రేంజ్‌లో వారణాసి బ్రాండింగ్‌

ఉస్తాద్‌ ప్రమోషన్స్‌లో నయా స్ట్రాటజీ

Follow Us