Loading video

ఎండ వేడి తట్టుకోలేక ఏసీ ఆన్‌ చేస్తున్నారా.. అయితే జర జాగ్రత్త

|

Mar 18, 2025 | 4:41 PM

వేసవి తాపం ప్రజలను అల్లాడిస్తోంది. ఫిబ్రవరిలోనే స్టార్టయిన ఎండలు మార్చిలోనే మండిస్తున్నాయి. ఎప్పుడో ఏప్రిల్‌ మేలలో వచ్చే మండు వేసవి ముందే వచ్చేసిందా అనిపిస్తోంది. ఉదయం 8 గంటలకే సూర్యుడు భగభగమంటున్నాడు. దీంతో ఇళ్లలో ఇన్నాళ్లూ రెస్ట్‌ తీసుకున్న ఏసీలకు పనిపడింది. అటకపై ఉన్న కూలర్లు కిందకి దిగుతున్నాయి.

ఇంత వరకూ ఓకే.. ఇక్కడే మీకో అలర్ట్‌.. ఇన్నాళ్లూ రెస్టింగ్‌ పొజిషన్‌లో ఉన్న ఏసీలు, కూలర్లలో విషసర్పాలు చేరి ఉండొచ్చు. ఎందుకంటే ఇటీవల పాములు వనాలను వదిలి జనాల్లో వాటి ఆవాసాలు ఏర్పరుచుకుంటున్నాయి. ఇక ఎండాకాలంలో చల్లదనం కోసం సర్పాలు వాటికి అనువుగా ఉండే ప్రాంతాల్లో తిష్టవేసేస్తున్నాయి. ఈ వీడియో చూస్తే ఆ విషయం మీకు స్పష్టంగా అర్థమవుంతుంది. ఒక్కసారి ఈ ఏసీలో చూడండి ఎన్ని పాములు చేరాయో.. విశాఖ జిల్లా పెందుర్తి పొలగానిపాలెం నేతాజీ నగర్ లోని ఓ అపార్ట్మెంట్‌లో గుట్టలు గుట్టలుగా పాములు కలకలం రేపాయి. ఓ ఇంట్లోని బెడ్రూమ్‌లో ఏసీ నుంచి వింత శబ్ధాలు వినిపించడంతో చుట్టూ పరిశీలించారు. ఏమీ కనిపించలేదు. కాసేపటికి వేడిగా ఉందని ఏసీ ఆన్ చేశారు. అలా ఏసీ ఆన్‌ చేయగానే ఆ స్ప్లిట్ నుంచి పాములు వేలాడుతూ కనిపించాయి. ఒకటి కాదు రెండు కాదు కట్టలు కట్టలుగా కనిపించడంతో భయంతో ఏసీని ఆపేసి అక్కడినుంచి పరుగులు తీశారు. దీంతో మళ్లీ లోపలకు వెళ్లిపోయాయి పాములు. వెంటనే స్నేక్‌ క్యాచర్‌కు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న స్నేక్‌ క్యాచర్‌ ఏసీ ఇండోర్ యూనిట్ నుంచి ఏకంగా ఆరు పాములను బయటకు తీశాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

డెబిట్ కార్డ్ లేకుండా యూపీఐ పిన్‌ని మార్చడం ఎలా?

వారానికి 90 గంటల పని చేయాలని సూచిస్తున్న కంపెనీల సీఈఓలు.. రోడ్డెక్కిన టెకీలు

ఈ చిన్నారుల ట్యాలెంట్‌కి ఎవరైనా అదరహో అనాల్సిందే

చనిపోయిన కుక్క జన్యువులతో క్లోనింగ్‌.. ఖర్చు రూ. 19 లక్షలా

అలర్ట్‌.. ఇకపై ఈ రైళ్లు కూడా చర్లపల్లి నుంచే..