
ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు రీల్స్ చేయడం అనేది ఒక ట్రెండ్‌గా మారింది. పనికొచ్చే రీల్స్ కాకుండా పనికి మాలిన రీల్స్ చేస్తూ ఇబ్బందులు పడిపోతున్నారు. సోషల్ మీడియాలో లైక్‌ల కోసం చేసే వీడియోల వల్ల నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. అలాంటి ఒక వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. ఓ యువతినది ఒడ్డున ఉల్లాసంగా నృత్యం చేస్తూ ఎంజాయ్ చేస్తోంది. కానీ కొన్ని క్షణాల్లోనే జరగరాని నష్టం జరిగిపోయింది. వీడియో చేస్తుండగా, ఆమె రూ. లక్ష విలువైన ఐఫోన్ నీటిలో పడిపోయింది. ఫోన్ నీటిలో పడిపోయినా కూడా గుర్తించకుండా వీడియో మైకంలోనే ఉండిపోయింది.
ఇది కూడా చదవండి: PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ 20వ విడత వచ్చేది అప్పుడే..!
రీల్ వల్ల భారీ నష్టం:
ఈ వీడియోలో ఒక అమ్మాయి వేగంగా ప్రవహించే నదిపై చెక్క వంతెనపై, కొండ ప్రాంతం లాంటి ప్రదేశంలో హాయిగా పడుకుని ఉన్నట్లు కనిపిస్తుంది. కెమెరా ఆన్‌లో ఉంది. స్టైల్ ఆన్‌లో ఉంది. ఆమె అలలతో ఎంజాయ్ చేస్తూ రీల్స్ చిత్రీకరించుకుంటోంది. కానీ రూ. లక్ష విలువైన ఐఫోన్ ఆమె జేబులోంచి నీటిలో పడిపోయింది.
रील के चक्कर में दीदी ने अपना भारी नुकसान कर लिया
दीदी का यह दुख कई हफ्तों में खत्म होगा 😄 pic.twitter.com/iL4MJe0dDi
— Rupali Gautam (@Rupali_Gautam19) June 28, 2025
ఈ వీడియో @Rupali_Gautam19 అనే ఖాతా నుండి షేర్ అయ్యింది. దీనిని ఇప్పటివరకు మిలియన్ల మంది వీక్షించారు, చాలా మంది ఈ వీడియోను లైక్ చేశారు. సోషల్ మీడియా వినియోగదారులు కూడా వీడియోకు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అందుకే చిన్న పొరపాటుతో పెద్ద నష్టం భరించాల్సిన పరిస్థితి వస్తుంటుంది. ఇలాంటి రీల్స్ భారీ నష్టమే కాకుండా లక్షల రూపాయలు నష్టపోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది.
ఇది కూడా చదవండి: Viral Video: ఇంట్లో వింత శబ్దాలు.. ఫ్రిజ్ వెనుకాల చూడగానే ముచ్చెమటలు పట్టేశాయ్.. వీడియో వైరల్
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి