Thirsty Crow Video Viral: అప్పటి కాకి కాదు.. ఇది 21వ శతాబ్దపు హైటెక్ కాకి దాహం తీర్చుకునే స్టైల్ వేరు

ఒక కాకికి దాహం వేసి నీటి కోసం చూస్తే దానికి మట్టి కుండ కనిపించింది. మట్టి కుండలో నీరు అడుగున ఉండడంతో గులకరాళ్లు తెచ్చి.. ఒకొక్కటి వేసి..

Thirsty Crow Video Viral: అప్పటి కాకి కాదు.. ఇది 21వ శతాబ్దపు హైటెక్  కాకి  దాహం తీర్చుకునే స్టైల్ వేరు
Thirsty Crow

Updated on: Mar 26, 2021 | 5:33 PM

Thirsty Crow Video Viral:  ఒక కాకికి దాహం వేసి నీటి కోసం చూస్తే దానికి మట్టి కుండ కనిపించింది. మట్టి కుండలో నీరు అడుగున ఉండడంతో గులకరాళ్లు తెచ్చి.. ఒకొక్కటి వేసి.. పైకి వచ్చిన నీటిని తాగి దాహం తీర్చుకుంది. మనం చిన్నతనంలో చదువుకున్న కథ..

అయితే ఇప్పుడు మనం 21వ శతాబ్దంలో ఉన్నాం.. అందుకని మనతో పాటు.. పక్షులు, జంతువులూ కూడా అప్డేట్ అయ్యాయి.. ఈ విషయాన్ని ఒక కాకి రుజువు చేస్తుంది. ఒక కాకికి దాహాం వేస్తుంటే అది తీరడానికి సులభమైన తెలివైన పరిష్కారం కనుగొంది.

భారతీయ అటవీ సేవా అధికారి సుశాంత నందా శుక్రవారం “నైపుణ్యం కలిగిన కాకి” అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఆ వీడియో షేర్ చేసిన గంటలోపు ఓ రేంజ్ లో నెటిజన్లలను ఆకట్టుకుంది. రీ ట్విట్స్ తో హల్ చల్ చేస్తుంది.

కాకి దాహం వేసినట్లు ఉంది.. అక్కడ కనిపించిన నీటి కుళాయి వరకునడచుకుంటూ వచ్చింది. వెంటనే కుళాయి పైభాగానికి చేరుకుంది. కుళాయిపై తన పాదాలతో గట్టిగా పట్టుకుని తన ముక్కుతో టాప్ ని పదే పడే కొడుతూ.. ఓపెన్ చేసింది. అప్పుడు ఆ కాకి హ్యాపీగా కుళాయి నుండి నీరు తాగింది.

Also Read: Gold and Silver Price: మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన పసిడి ధర.. పెరిగిన వెండి ..

ఈతకొట్టలేక ఇబ్బంది పడుతున్న బాతుపిల్లకు సాయం అందించిన మృగరాజు.. వీడియో వైరల్