ఓ గోడౌన్‌లో చొరబడిన పామును అర నిమిషంలో పట్టేసింది !!
పాములంటే అందరికీ భయమే. సాధారణంగా వాటి జోలికి ఎవరూ వెళ్లరు. ఒకవేళ అవి ఇళ్లలోనో, మనుషులు తిరిగే ప్రాంతాల్లోనో కనిపిస్తే కాస్త ధైర్యవంతులైతే వాటిని హతమారుస్తారు.. లేదంటే స్నేక్ క్యాచర్‌కి సమాచారమిస్తారు. తాజాగా ఓ గోడౌన్లో పాము చొరబడటంతో అక్కడున్నవారంతా భయంతో పరుగులు తీశారు. కొందరు స్నేక్ క్యాచర్‌కు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ రంగంలోకి దిగింది.. అదేంటి దిగింది అంటున్నారు..
పాములంటే అందరికీ భయమే. సాధారణంగా వాటి జోలికి ఎవరూ వెళ్లరు. ఒకవేళ అవి ఇళ్లలోనో, మనుషులు తిరిగే ప్రాంతాల్లోనో కనిపిస్తే కాస్త ధైర్యవంతులైతే వాటిని హతమారుస్తారు.. లేదంటే స్నేక్ క్యాచర్‌కి సమాచారమిస్తారు. తాజాగా ఓ గోడౌన్లో పాము చొరబడటంతో అక్కడున్నవారంతా భయంతో పరుగులు తీశారు. కొందరు స్నేక్ క్యాచర్‌కు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ రంగంలోకి దిగింది.. అదేంటి దిగింది అంటున్నారు.. అంటే అమ్మాయా…? అనుకుంటున్నారుకదా.. సరిగ్గా అక్కడున్న వాళ్లు కూడా అలాగే అనుకున్నారు. ఈమెవల్ల అవుతుందా అనుకున్నారు. కానీ వాళ్ల అంచనాలను తలకిందులు చేస్తూ చాకచక్యంగా పామును పట్టేసి వాళ్ల నోరువెళ్లబెట్టేలా చేసింది. కొర్రమేను చేపను చేత్తో పట్టుకొచ్చినట్టు గోడౌన్ లోనుంచి పామును చేత్తో పట్టుకొని బయటకొచ్చింది. అంతేకాదు దానిని ఎంతో చాకచక్యంగా ఓ సన్నని ప్లాస్టిక్ డబ్బాలోకి పంపించి బంధించింది. అదంతాచూసి అక్కడున్నవాళ్లంతా ముక్కున వేలేసుకున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే పామును పట్టేసిన ఆ యువతి ట్యాలెంట్‌కు అక్కడున్నవాళ్లే కాదు నెటిజన్లు కూడా షాకవుతున్నారు. అనంతరం ఆ పామును తీసుకెళ్లి యువతి అటవీప్రాంతంలో వదిలిపెట్టింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆయన చేతులే మెషిన్లు !! వ్యక్తి ట్యాలెంట్‌కి నెటిజన్లు ఫిదా
టివీ చూస్తున్నతండ్రి.. పెగ్ కలుపుతున్న కొడుకు.. చివరిలో సూపర్ ట్విస్ట్
కంటెంట్ క్రియేటర్లకు గుడ్ న్యూస్.. యూట్యూబ్‌లో ఎడిటింగ్ మరింత ఈజీ..
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా

