ఆయన చేతులే మెషిన్లు !! వ్యక్తి ట్యాలెంట్‌కి నెటిజన్లు ఫిదా
పట్టాలు పుచ్చుకున్న పట్టభద్రుల్లోనే కాదు, కాయకష్టం చేసి బ్రతికే కష్ట జీవుల్లోనూ ప్రతిభావంతులు ఉన్నారు. పట్టభద్రులు ఫార్ములాలు, మెషిన్లు, మెజర్‌మెంట్స్ కావాలి. కానీ పట్టాలేని ఈ పట్టభద్రులకు చేతులే మెషిన్లు.. అనుభవమే మెజర్‌మెంట్.. పనితనమే ఫార్ములా.. అలాంటి ఎందరో మట్టిమాణిక్యాలకు నెలవు మన భారతదేశం. ప్రస్తుతం ఇంటర్నెట్ విస్తృతి పెరిగిన తర్వాత ఇలాంటి ఎందరో వెలుగులోకి వస్తున్నారు. తాజాగా అలాంటి ఓ వ్యక్తికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
పట్టాలు పుచ్చుకున్న పట్టభద్రుల్లోనే కాదు, కాయకష్టం చేసి బ్రతికే కష్ట జీవుల్లోనూ ప్రతిభావంతులు ఉన్నారు. పట్టభద్రులు ఫార్ములాలు, మెషిన్లు, మెజర్‌మెంట్స్ కావాలి. కానీ పట్టాలేని ఈ పట్టభద్రులకు చేతులే మెషిన్లు.. అనుభవమే మెజర్‌మెంట్.. పనితనమే ఫార్ములా.. అలాంటి ఎందరో మట్టిమాణిక్యాలకు నెలవు మన భారతదేశం. ప్రస్తుతం ఇంటర్నెట్ విస్తృతి పెరిగిన తర్వాత ఇలాంటి ఎందరో వెలుగులోకి వస్తున్నారు. తాజాగా అలాంటి ఓ వ్యక్తికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అతని ట్యాలెంట్ చూసి నెటిజన్లు షాకవుతున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి ఇటుకల ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఇందులో విశేషమేముంది అనుకుంటే పొరపాటే. సాధారణంగా ఇటుకలు చాలా డెలికేట్‌గా ఉంటాయి. కిందపడినా, బలంగా ఏదైనా వాటిపైన పడినా చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోతుంది. ఇక అలాంటి ఇటుకలను పలకలుగా కట్‌చేయాలంటే మెషిన్లపైనే సాధ్యమవుతుంది. కానీ ఈ పెద్దాయన అంత సున్నితమైన ఇటుకలను సుత్తి, ఉలితో ఎంతో ఈజీగా వేగంగా పలకలుగా కట్‌చేసేస్తున్నాడు. మందపాటి ఎర్రటి ఇటుకను తీసుకుని, దాని చుట్టూ సుత్తి, ఉలితో సున్నితంగా కొడుతూ.. ఒకే సైజులో 5 పలకలుగా దాన్ని కట్‌చేశాడు. పెద్దాయన ట్యాలెంట్‌కి ముగ్ధుడైన ఓ వ్యక్తి.. వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ఆ వ్యక్తి ట్యాలెంట్‌కి ఫిదా అయిపోయారు. ఈ వీడియోను ఇప్పటికే 2 లక్షలమందికి పైగా లైక్ చేశారు. అద్భుతం.. మెషిన్ కూడా ఇంత బాగా కట్ చేయదేమో.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టివీ చూస్తున్నతండ్రి.. పెగ్ కలుపుతున్న కొడుకు.. చివరిలో సూపర్ ట్విస్ట్
కంటెంట్ క్రియేటర్లకు గుడ్ న్యూస్.. యూట్యూబ్‌లో ఎడిటింగ్ మరింత ఈజీ..
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

