ఇది చూశాక కూడా రన్నింగ్‌ రైలు ఎక్కే దమ్ముందా? వీడియో

Updated on: May 21, 2025 | 9:31 AM

ప్రమాదాలు అనుహ్యంగా జరగడం వేరు, ప్రమాదాలను కొనితెచ్చుకోవడం వేరు. ఆ పని ప్రమాదమని తెలిసి కూడా దాన్నే చేస్తుంటారు చూడు. దాన్నే కొనితెచ్చుకోవడం అంటారు. ప్లాట్‌ఫామ్ మీద రన్నింగ్ రైలు ఎక్కడం ఎంత ప్రమాదకరమో తెలిసి కూడా కొంతమంది అలాగే చేస్తుంటారు. ప్రమాదాల బారిన పడుతుంటారు. ఇక సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రీల్స్ కోసం ప్లాట్‌ఫామ్ మీద స్టంట్స్ వేస్తూ చుట్టుపక్కల వారిని కూడా ప్రమాదాల బారిన పడేస్తుంటారు. మరి కొంతమంది త్వరగా గమ్యస్థానాలకు చేరుకోవాలనే ఆతృతలు కాళ్లు, చేతులు విరగొట్టుకుంటుంటారు. అలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.

 ఓ ముసలాయన రన్నింగ్ రైలు ఎక్కుతూ తాను పడిందే కాకుండా ఓ యువకుడిని సైతం కింద పడేశాడు. ఈ ఘటన కర్ణాటకలో జరిగినట్లు తెలుస్తోంది. ఓ వృద్ధుడు రైలు ఎక్కేందుకు రైల్వే స్టేషన్‌కు చేరుకుంటాడు. అయితే అప్పటికే రైలు కదులుతుంటుంది. అయినా అతను రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తాడు. పరిగెత్తుకుంటూ వెళ్లి జనరల్ బోగీ డోర్ పట్టుకొని నిలబడతాడు. అప్పటికే అక్కడ కొంతమంది నిలబడి ఉంటారు. ఆ క్రమంలో ఆ వృద్ధుడు బ్యాలెన్స్ తప్పి అక్కడున్న యువకుడిని పట్టుకుంటాడు. దీంతో ఇద్దరు అదుపు తప్పి ఒక్కసారిగా కిందపడిపోతారు. వారు కిందపడటం చూసినవారంతా పరిగెత్తుకుంటూ వచ్చి పక్కకు లాగేస్తారు. దీంతో వారు ఎలాంటి గాయాలు కాకుండా క్షేమంగా బయటపడ్డారు. కాగా ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. ఈ పెద్దాయన ఎంత పని చేశాడో అంటూ కొందరు ఇలాంటి పనులు చేయడం వల్ల తాము ప్రమాదంలో పడటమే కాకుండా ఎదుటి వారిని కూడా ప్రమాదంలోకి నెడుతారని పోస్టులు పెడుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం :

బరాత్ తీయలేదని.. పెళ్లి కూతురు జంప్ వీడియో

వైద్యరంగంలో ఏఐ విప్లవం.. డాక్టర్లు, నర్సులు అంతా రోబోలే వీడియో

‘జిలేబీ బేబీ’ పాట పాడిన మిస్‌ యూఎస్‌ఏ వీడియో