Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆఫీసులో పని ఒత్తిడి భరించలేక బలవన్మరణం వీడియో

ఆఫీసులో పని ఒత్తిడి భరించలేక బలవన్మరణం వీడియో

Samatha J

|

Updated on: May 21, 2025 | 10:26 AM

బెంగళూరులో 25 ఏళ్ల మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్ ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. పని ఒత్తిడిని తట్టుకోలేకే తీవ్ర బలవంతుడైన మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అధికంగా పని ఒత్తిడి, మేనేజర్ అనుచిత ప్రవర్తన కారణంగానే ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ ఘటన టెక్ వర్కర్లలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కుత్రిమ్ ఏఐ కంపెనీలో మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్ గా పనిచేస్తున్న నిఖిల్ సోయ వంశీ మృతదేహం మే 8న బెంగళూరులోని అగర సరస్సులో లభ్యమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిఖిల్ బెంగళూరులోని ప్రతిష్టాత్మకంగా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన వెంటనే గత ఏడాది ఆగస్టులో కుత్రిమ్ లో చేరాడు.

అయితే కంపెనీలో అమెరికాలో ఉంటున్న మేనేజర్ రాజ్ కిరణ్ పనిగంటల ప్రవర్తన కారణంగా పలువురు ఉద్యోగులు రాజీనామా చేయగా వారి పనుల భారం కూడా నిఖిల్ పై పడిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మేనేజర్ రాజ్ కిరణ్ కొత్తగా చేరిన ఉద్యోగులతో చాలా దూర్షంగా మాట్లాడేవారని భయానక వాతావరణం సృష్టించేవారని ఆయన తీరు వల్లే చాలా మంది ఉద్యోగులు కంపెనీని వదిలి వెళ్ళిపోయారని టాక్ వినిపిస్తోంది. నిఖిల్ మృతి తమను తీవ్రంగా కలిచివేసిందని తాము అధికారుల దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తున్నామని కుత్రిమ్ కంపెనీ తెలిపింది. అయితే నిఖిల్ మరణం తర్వాత కూడా సదరు మేనేజర్ మిగిలిన ఉద్యోగులతో దూర్షంగా ప్రవర్తించడం మానలేదని కొందరు కుత్రిమ్ ఉద్యోగులు ఆరోపించారు. మేనేజర్ ప్రవర్తన చాలాకాలంగా దూకుడుగా అవమానకరంగా ఉండేదని జూనియర్ ఉద్యోగులను తక్కువ చేసి మాట్లాడుతూ వారిని అసమర్ధులుగా ముద్రవేసేవారని తెలిపారు. తాజా ఘటనతో కార్పొరేట్ కంపెనీల్లో పని వాతావరణం ఉద్యోగుల మానసిక ఆరోగ్యంపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదని మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు మానుకోవాలని సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం :

బరాత్ తీయలేదని.. పెళ్లి కూతురు జంప్ వీడియో

వైద్యరంగంలో ఏఐ విప్లవం.. డాక్టర్లు, నర్సులు అంతా రోబోలే వీడియో

‘జిలేబీ బేబీ’ పాట పాడిన మిస్‌ యూఎస్‌ఏ వీడియో