Viral Video: ఒకే స్టోర్‌లో 22 సార్లు దోపిడీ చేశాడు.. లైవ్‌గా దొరికినా వదిలేసిన జడ్జి.. ఎందుకో తెలుసా?

|

Jan 31, 2022 | 5:15 PM

Trending Video: ఓ సూపర్‌మార్కెట్‌లో కస్టమర్‌గా నటిస్తూ 70 అంగుళాల టీవీని దొంగిలించి బయటకు వచ్చిన వ్యక్తిని డోర్‌ వద్ద నిల్చున్న గార్డులు పట్టుకున్నారు.

Viral Video: ఒకే స్టోర్‌లో 22 సార్లు దోపిడీ చేశాడు.. లైవ్‌గా దొరికినా వదిలేసిన  జడ్జి.. ఎందుకో తెలుసా?
Viral Video
Follow us on

Viral Video: USAలోని సీటెల్‌లోని ఒక సూపర్‌మార్కెట్‌లో, ఒక కస్టమర్ దాదాపు $600 విలువైన 70-అంగుళాల టీవీతో బయటకు వచ్చాడు. తలుపు వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డులకు అనుమానం వచ్చి ఆ వ్యక్తిని టీవీ కొనుగోలు చేసినందుకుగాను రశీదు అడిగారు. అయితే అతను టీవీని ఎత్తేసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆ వ్యక్తిని చుట్టుముట్టిన గార్డులు.. ఎట్టకేలకు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు నెట్టింట్లో(Viral Video) తెగ సందడి చేస్తుంది.

టీవీని దొంగిలించిన వ్యక్తి పేరు జాన్ రే లోమాక్ (వయస్సు 55) అని, అతడు నిరాశ్రయుడని తెలుస్తోంది. వరుస దుకాణాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నాడని పోలీసుల విచారణలో తేలింది. అలాగే, లోమాక్ గత మూడు నెలల్లో ఇదే సూపర్‌మార్కెట్‌లో 22 సార్లు దొంగిలించాడని, గత డిసెంబర్‌లో ఇలాంటి టీవీని దొంగిలించడానికి ప్రయత్నించినందుకు దుకాణంలోకి ప్రవేశించకుండా నిషేధించారని సూపర్ మార్కెట్ సిబ్బంది తెలిపారు. అనంతరం లోమాక్‌ను కోర్టులో హాజరుపరిచారు. కానీ లోమాక్ నిరాశ్రయుడు కాబట్టి న్యాయమూర్తి నిర్దోషిగా ప్రకటించాడు.

Also Read: Vizag Drug Case: ప్రియుడు కోసం డ్రగ్స్‌ తెచ్చిన ప్రియురాలు.. లైవ్ వీడియో

Snow Storm In USA: మంచుతుఫాన్‌తో అమెరికా గజగజ.. లైవ్ వీడియో