Viral Video: జారుడుబల్లపై జారుతూ..పాండాల సందడికి నెటిజన్ల ఫిదా..చూస్తే మీరూ కచ్చితంగా సూపర్ అంటారు! 

|

Aug 01, 2021 | 5:31 PM

పాండాలు చూడటానికి చిన్నగా ఉంటాయి. ముద్దుగా ఉంటాయి. వీటికి తెలివితేటలు చాలా ఎక్కువ. మనుషులతో పోటీపడేంతగా అల్లరి చేస్తాయి. అరుదైన జాతులుగా వీటిని ప్రపంచవ్యాప్తంగా పరిరక్షిస్తున్నారు.

Viral Video: జారుడుబల్లపై జారుతూ..పాండాల సందడికి నెటిజన్ల ఫిదా..చూస్తే మీరూ కచ్చితంగా సూపర్ అంటారు! 
Viral Video
Follow us on

Viral Video:  పాండాలు చూడటానికి చిన్నగా ఉంటాయి. ముద్దుగా ఉంటాయి. వీటికి తెలివితేటలు చాలా ఎక్కువ. మనుషులతో పోటీపడేంతగా అల్లరి చేస్తాయి. అరుదైన జాతులుగా వీటిని ప్రపంచవ్యాప్తంగా పరిరక్షిస్తున్నారు. కొన్ని చోట్ల జూపార్క్ లలో ఈ పాండాలను సంరక్షిస్తున్నారు. పాండాలను జాగ్రత్తగా చూసుకునే సంరక్షకులకు అవి ఒక్కోసారి చుక్కలు చూపిస్తాయి. వాటి అల్లరితో విసుగు తెప్పించేస్తాయి. పాండాలు చేసే అల్లరి చూసిన వారికి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మన ఇళ్లలో చిన్నపిల్లలు చేసే అల్లరి మాదిరిగానే వాటి అల్లరి ఉంటుంది. ఆ మధ్య ఒక జూలో పాండాలు తమ సంరక్షకురాలిని ముప్పుతిప్పలు పెట్టాయి. ఆమె శుభ్రం చేయడానికి ప్రయత్నిస్తుంటే..అవి ఆమెకు అడ్డుపడి.. చిందరవందర చేసేస్తూ రచ్చ చేసేశాయి. ఈ వీడియో అప్పట్లో వైరల్ గా మారింది. ఇదిగో ఇప్పుడు మరో పాండాల అల్లరి ఆటలను సోషల్ మీడియాలో పెట్టారు. అది వైరల్ అయిందిప్పుడు.

ఈ వీడియోలో పాండాలు జారుడు బల్లపై నుంచి చిన్నపిల్లలు జారినట్టు జారుతూ ఆడుతున్నాయి. మెట్లెక్కి జారుడు బల్లమీదికి చేరుకొని.. అక్కడ నుంచి కిందకు జారుతున్నాయి. వాటి సంరక్షకురాలు జాగ్రత్తగా వాటిని గమనిస్తూ వాటిని జారుడు బల్లపై జార్చుతోంది. అందులో ఒక పాండా జారుడు బల్లపై రివర్స్ లో పైకి ఎక్కి తిరిగి కిందికి జారుతోంది. ఈ హడావుడిలో కింద ఉన్న పాండాలు మొగ్గలు వేశాయి. ఇలా పాండాలు చేస్తున్న సందడి వీడియోలో ఆకట్టుకునేలా ఉంది. దీంతో ఈ వీడియో ట్విట్టర్ లో వైరల్ గా మారింది.

పాండాలు జారుడు బల్ల మీద జారుతున్న 30 సెకన్ల ఈ వీడియోను “పాండా స్లయిడ్”  అనే క్యాప్షన్ తో బ్యూటెన్‌జీబీడెన్ తన ట్విట్టర్ హ్యాండిల్ లో షేర్ చేశారు. ఆమె ట్విట్టర్ లో ఇది షేర్ చేసిన వెంటనే ఇది వైరల్ అయిపొయింది. ఇప్పటికే ఏభై వేల మందికి పైగా ఈ వీడియో చూశారు. మీరు కూడా ఆ వీడియోనూ ఈ ట్వీట్ లో చూసేయండి.

” పాండాలు చేసినప్పుడు దేవుడు మంచి మానసిక స్థితిలో ఉన్నాడు” అని ఒకట్విట్టర్ యూజర్ కామెంట్ చేశారు. మరో యూజర్ నేను పాండాలను ప్రేమిస్తాను అంటూ ట్వీట్ చేశారు. ఇలాంటి కామెంట్స్ ఈ పోస్ట్ కు చాలా ఎక్కువగా వచ్చాయి.

 

Also Read: Viral Video: స్టైల్‌గా రోడ్డుపై రయ్‌ రయ్‌ మంటూ సైకిల్‌పై కుక్క రైడ్‌.. నెట్టింట వీడియో వైరల్

కరిస్తే.. చంపేస్తారా..?? పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం.. వీధి కుక్కలకు విషపు ఇంజెక్షన్లు.. వీడియో