Viral Video: రాక్షస అనకొండను ఒడుపుగా పట్టేశాడు.! మయామి జూ కీపర్ సాహసం.

|

Nov 24, 2023 | 9:53 AM

మామూలు పామును చూస్తేనే ఆమడ దూరం పారిపోతాం. ఇక అనకొండను చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి. వన్య ప్రాణ సంరక్షణ కార్యకర్తలు, జూ సంరక్షకులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటారు. ఎంతటి క్రూర మృగాన్నైనా మచ్చిక చేసుకుని, వాటితో స్నేహంగా ఉంటారు. కానీ ఒక భారీ అనకొండను నిర్భయంగా ఉత్తి చేతులతో అలా అలవోకగా, మేనేజ్‌ చేసిన వీడియో తాజాగా నెట్టింట సందడి చేస్తోంది.

మామూలు పామును చూస్తేనే ఆమడ దూరం పారిపోతాం. ఇక అనకొండను చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి. వన్య ప్రాణ సంరక్షణ కార్యకర్తలు, జూ సంరక్షకులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటారు. ఎంతటి క్రూర మృగాన్నైనా మచ్చిక చేసుకుని, వాటితో స్నేహంగా ఉంటారు. కానీ ఒక భారీ అనకొండను నిర్భయంగా ఉత్తి చేతులతో అలా అలవోకగా, మేనేజ్‌ చేసిన వీడియో తాజాగా నెట్టింట సందడి చేస్తోంది. అతని అసాధారణ సాహసానికి, నైఫుణ్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఫ్లోరిడాలోని మయామి జూ కీపర్ మైక్ హోల్‌స్టన్ Instagramలో ఈ వీడియోను పోస్ట్‌ చేశారు. తనను తాను రియల్ టార్జాన్, కింగ్ ఆఫ్ ది జంగిల్ అని చెప్పుకునే హోల్‌స్టన్ తరచుగా వన్యప్రాణులకు సంబంధించిన చాలా ఆసక్తికరమైన వీడియోలను షేర్‌ చేస్తూ ఉంటాడు. ఇది కూడా అలాంటిదే. నీటిలో దాగి వున్న ఓ భారీ అనకొండ సమీపానికి జాగ్రత్తగా వెళ్లి.. చటుక్కున దాని తలను ఒడిసిపట్టుకున్నాడు. సాధారణంగా అనకొండ ఎంత బలిష్టమైన వారినైనా తన పట్టుతో లొంగదీసుకుంటుంది. కానీ తన నైపుణ్యంతో బలీయమైన అనకొండను పట్టుకోవడం, దానిపై నియంత్రణ సాధించడం, చివర్లో దాన్ని ముద్దు పెట్టుకోవడం విశేషంగా నిలిచింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 5 రోజుల క్రితం పోస్ట్ చేసిన ఈ వీడియో 11.2 మిలియన్లకు పైగా వ్యూస్‌ సాధించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.