Viral Video: వీడి క్రియేటివిటీ మాములుగా లేదుగా.. సలాం కొడుతోన్న నెటిజన్స్.. వైరల్ వీడియో

Trending Video: తాజాగా ఇలాంటిదే ఓ వీడియో నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది. ఇందులో ఒక వ్యక్తి తన కోసం జుగాడ్ సహాయంతో అద్భుతమైన స్కూటర్‌ని సిద్ధం చేసుకున్నాడు.

Viral Video: వీడి క్రియేటివిటీ మాములుగా లేదుగా.. సలాం కొడుతోన్న నెటిజన్స్.. వైరల్ వీడియో
Scooter Viral Video

Updated on: Jan 11, 2022 | 9:52 AM

Desi Jugaad Viral Video: జుగాడ్‌కి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వినియోగదారులకు బాగా నచ్చడంతో వీటి స్థానం మరింత పెరిగింది. తాజాగా ఇలాంటిదే ఓ వీడియో నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది. ఇందులో ఒక వ్యక్తి తన కోసం జుగాడ్ సహాయంతో అద్భుతమైన స్కూటర్‌ని సిద్ధం చేసుకున్నాడు. ఇది చూసిన తరువాత సోషల్ మీడియాలో ఆశ్చర్యపోతూ కామెంట్లు చేస్తున్నారు. అసలు విసయంలోకి వెళ్తే..

కార్లు, స్కూటర్లు, బైక్‌లు అన్నీ ఇప్పుడు ఎలక్ట్రిక్‌గా మారుతున్నాయని మనకు తెలిసిందే. కానీ ఇప్పటికీ భారతదేశంలోని రోడ్లపై జుగాడ్‌తో తయారు చేసుకున్న వాహనాలు నడుస్తున్నాయి. ఒక వ్యక్తి జుగాడ్‌తో అలాంటి ఓ స్కూటర్‌ను తయారు చేశాడు. ఇది చూసి ఇంజనీర్లు కూడా ఆశ్చర్యపోతారు.

వైరల్ అవుతోన్న ఈ వీడియోలో, ఓ వ్యక్తి చాలా వింతగా స్కూటర్ నడుపుతున్నట్లు మనం చూడవచ్చు. మొదటిసారి ఈ వీడియో చూసిన తర్వాత, స్కూటర్ వేరే వాహనాన్ని లాగుతున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వాహనం ముందు నుంచి కాకుండా వెనుక నుంచి కదులుతోంది. కానీ, తదుపరి ఫ్రేమ్‌లో స్కూటర్ హ్యాండిల్ ఉన్నట్లు కనిపిస్తోంది. అందులో ఓ వ్యక్తి కూర్చుని ఆనందంతో స్కూటర్ నడుపుతున్నట్లు మనం చూడొచ్చు.

వీడియోపై పలువురు కామెంట్లు చేస్తూ.. ఆ వ్యక్తి టాలెంట్‌ను మెచ్చుకుంటున్నారు. ‘ఈ వీడియో చూసిన తర్వాత ఇంజనీర్లు ఆశ్చర్యపోతారు’ అని ఒక యూజర్ కామెంట్ చేశాడు. ‘ఈ జుగాడ్ మన దేశం నుంచి బయటకు వెళ్లకూడదని కొందరు కామెంట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Also Read: Viral Video: ఈయన మామూలోడు కాదు.. ఏకంగా కొండ చిలువనే..! నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో

Coronavirus Omicron Danger Bells: ఒక్కరోజులో 1.80 లక్షల మందికి కరోనా.. రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూలు..(video)