రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం..భయంతో ఆగిపోయిన వాహనాలు వీడియో

Updated on: Sep 11, 2025 | 1:32 PM

తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. తెలంగాణలోని వరంగల్‌లో భారీ వర్షాలతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ క్రమంలో పుట్టలు, అటవీప్రాంతాల్లో ఉండాల్సిన పాములు ఆవాసాలు కోల్పోయి జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో ఓ పెద్ద నాగుపాము ఆవాసం వెతుక్కుంటూ రోడ్డు దాటుతోంది. రాత్రివేళ రోడ్డుపై కనిపించిన భారీ నాగుపామును చూసి వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వాహనాల ధ్వనులు, జనాల అలికిడికి ఎటు వెళ్లాలో తెలియక నడిరోడ్డుపై పాము పడగవిప్పి నిల్చుండిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

హనుమకొండలో నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారిపై నాగుపాము ప్రత్యక్షమవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. నక్కలగుట్ట ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం సర్కిల్ లో ఈ పాము ప్రత్యక్షమైంది. పక్కనే ఉన్న పొదల్లోనుంచి రోడ్డుపైకి వచ్చిన పొడవాటి నాగుపాము రోడ్డుపై చుట్టచుట్టుకొని పడగవిప్పి బుసలు కొట్టింది. వాహనాల లైట్ల వెలుగులో దాదాపు గంటకు పైగా ఆ పాము రోడ్డుపై హల్చల్‌ చేసింది. రోడ్డుపై పామును చూసి వాహనదారులు కొందరు భయంతో వాహనాలను ఆపివేశారు. మరి కొందరు ఆ పామును తమ మొబైల్స్‌లో చిత్రీకరించారు. స్థానికులు పామును చూసేందుకు ఎగబడ్డారు. తర్వాత కొద్దిసేపటికి పాము పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లిపోయింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

లగ్జరీ బంగ్లాను ఖాళీ చేసిన స్టార్‌ కపుల్‌.. కారణం తెలిస్తే షాకవుతారు వీడియో

ఏపీ, తెలంగాణలో దసరా సెలవులు ఎప్పటినుంచంటే? వీడియో

‘స్పిరిట్’ పై సందీప్ రెడ్డి అప్ డేట్.. ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు వీడియో

ఎంతైనా తల్లితల్లే..పిల్లల కోసం చిరుత ఏం చేసిందంటే? వీడియో

Published on: Sep 11, 2025 01:25 PM