Horse Attacks Alligator: మొసలిపై దాడి చేసిన గుర్రం.. తరిమి తరిమి కొట్టిన వైనం.. వీడియో వైరల్

Horse Attacks Alligator: ఎప్పుడైనా గుర్రం మొసలిల మధ్య పోరాటం చూశారా.. అసలు వీటి మధ్య యుద్ధం ఊహకు కూడా అందని విషయం కదా.. ఎందుకంటే మొసలి నీటిలో..

Horse Attacks Alligator: మొసలిపై దాడి చేసిన గుర్రం.. తరిమి తరిమి కొట్టిన వైనం.. వీడియో వైరల్
Horse Attacks Alligator

Updated on: Apr 10, 2021 | 2:46 PM

Horse Attacks Alligator: ఎప్పుడైనా గుర్రం మొసలిల మధ్య పోరాటం చూశారా.. అసలు వీటి మధ్య యుద్ధం ఊహకు కూడా అందని విషయం కదా.. ఎందుకంటే మొసలి నీటిలో నివసిస్తుంది. ఇక గుర్రం భూమి మీద అదీ.. నీటి వనరులకు చాలా దూరంగా నివసిస్తుంది. అయితే గుర్రం మొసలి మీద ఫైటింగ్ కి వెళ్లిన వీడియో ఒకటి ఎప్పుడో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. అయితే తాజాగా ఈ వీడియో మళ్ళీ బయటకు వచ్చి.. నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది.. మరి అంతగా ఆకట్టుకునేలా ఏముంది ఆ వీడియోలో అంటే

ఒక మొసలి గడ్డి ఉన్న నేలమీద నిద్రపోతుంది. అక్కడికి దగ్గరలో కొన్ని గుర్రాలు మేత తింటున్నాయి. ఆ మందకు కొంచెం దూరంలో మొసలికి దగ్గరగా.. ఒక గుర్రం గడ్డి తింటుంది.. అప్పుడు మొసలి తోక గుర్రానికి ఎదురుగా ఉంది.. గడ్డితింటున్న గుర్రం సడెన్ గా ముసలిపై అటాక్ చేసింది. నిద్రపోతున్న మొసలి ఉల్కిపడి ముందుకు పాక్కుంటూ వెళ్తుంది.. అయినప్పటికీ మళ్ళీ గుర్రం మొసలి మీద అటాక్ చేయడానికి దూకింది. అదే సమయంలో మొసలి పెద్దగా నోరు తెరిచి గుర్రం కాలుని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ గుర్రం వేగంగా తన కాలుని తీసుకోవడంతో మొసలి ఎటాక్ నుంచి తప్పించుకుంది. వెంటనే ఆ గుర్రం మిగిలిన గుర్రాల మంద వద్దకు చేరుకుంది.

ఇదంతా ఓ వ్యక్తి వీడియో తీస్తున్నాడు.. గుర్రం మొసలి పోరాటంతో పాటు.. ఓ వ్యక్తి వీడియో తీయడం కూడా ఆ వీడియోలో ఉంది. ప్రస్తుతం మళ్ళీ వైరల్ అవుతుంది ఈ వీడియో పై మీకు ఓ లుక్ వేయండి.

Also Read: మూడు సింహాలు నిద్రిస్తున్న వేళ.. వాటిని భయపెట్టిన అడవిపంది.. ఫన్నీ వీడియో వైరల్

టెన్త్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..!